Books Published
Kaliyugamlo Daiva Mahimalu
శ్రీ చౌడేశ్వరి దేవి చరిత్ర (Sri Chowdeshwari Devi Historical Devotional Story)
బొజ్జన్న-బొజ్జక్క రజకదంపతులు
నేడుగాని నాటిరోజుల్లో బొజ్జన్న-బొజ్జక్క లిద్దరు మావూరి చిత్రావతికి ఆవలి ఒడ్డునున్న పొరుగూరిన నుండు రజకదంపతులు సంతానలేమి కారణంగ రెండు గార్ధభాలను పెంచి నవియే బిడ్డలై తోడునీడగ నుండ పెందలాడె లేచిన బొజ్జమ్మ ఇంటిపాచిపని చకచకజేసి గాడిదలకు మేతవేసి నీరుతాపి రాత్రితాగిన సారాయిమత్తు వదలక బొజ్జన్న నటులే మగతగా పడుకొనుండ వీపున తట్టితట్టి నిదురలేపి వేడివేడి బెల్లము కాపీనీళ్ళు కాచి లోటానిండుగ మొగునికిచ్చి తానుతాగి ఇంటివాకిలికి గొల్లెముతగిలించి గంగాళాలు గాడిదల వీపున తగిలించి పొద్దుపుడవంగబయలుదేరి పొరుగూరైన మావూరి ఏటివొడ్డు చాకిరేవుకిచేరి మావూరిన యిల్లిల్లు ఇద్దరు తిరిగి మాసిన బట్టలేరుకొని మూటలుక ట్టి ఇంటిల్లిపాది వంటింటతెచ్చి వడ్డించిన చద్దిఅన్నము ముద్దపప్పు మజ్జిగ నీళ్ళు గిన్నెల నింపుకొని గంపలో పెట్టుక తీసుకెల్లి తోటిరజకులతో కలిసి ఏటికాల్వవొడ్డున ఇసుకమేటలపై గుంపుగ కూర్చుండి. అందరు తెచ్చిన అన్నములో రకవారి కూరలు కలిపి ముద్దలుజేసి వడ్దించుకొని కడుపారగ తిని చిత్రావతి ఏటి పంటకాలువలో చేతులుకడిగి దోసిల్లతో చల్లనీరు నింపుకొని తాగి మురుకి బట్టలు సౌవుడు బానల్లో ఉబ్బకు నానబెట్టి గంగాళాలలో ఉడికించి పంగలకట్టెతో నొక్కొక్కటి బయటికితీసి "ఇస్సో..ఇస్సో..ఆఇస్సో"యంటు ఊక దంపుడు ఊతపదం పాడుతు చాకిరేవు బండలపై పదేపదే బట్టల తిప్పితిప్పి మోదుతూ ఉతుకుతూ ఏటియిసుకేసి అరికాళ్ళ మెడాళతో రాకిరాకి రుద్ది రుద్ది మురికి ఊడగొట్టి తెల్లంగజేసి పారెఏటికాల్వ నీటిలో జాడించి జాడించి దేవేసి దేవేసి వడపిండి వడపిండి ఇదిలించి ఇదిలించి ఇద్దరుకలిసి పంచల చీరల మడతలు పోగొట్ట విప్పి లాగిచిత్రావతి యిసుక మేటలపై ఎండకు ఒంటిపొరపై పల్చగ నారబెట్టి సాయంకాలానికి ఎండిన బట్టల నొక్కొక్కటిగఏరి చెరి ఒక పక్క మూలలు బిగువన పట్టి గుంజిలాగి మడిసి మల్లీ మల్లీ మడిసి యింటిల్లి గుర్తులు వారిగ మోపులుగట్టి అన్నిటినికలిపి మూటలుగట్టి మూటముడి తలకుతగిలించుకొని వీపున వేలాడగ తీసుకొనివెళ్ళి 'ఇంటింటివారి గుడ్డలు లెక్కగట్టిఇచ్చి రాత్రి యింటిల్లిపాది తట్టలతో వడ్డించిన వేడన్నముపప్పుచారు వూరిమిండి ఇంటికి తెచ్చుకొని కడుపారగ తిని మిగిలినది కొడుకులుగాని కొడుకులైన గార్దభములకు తినిపించి నీరుదాపి హాయిగ ప్రతిరేయి నిదురించుచుండ నాటికాలము పీర్లపండుగకు రైతులిచ్చిన ఇనాముపైసలతో బొజ్జన్న సారాయి కుతి కెలదాకా తప్పతాగి కఫము గొంతుకు నడ్డుపడి ఊపిరాడక నిదురించినవాడు నిదురించినట్లు బొజ్జమ్మను ఏకాకినిజేసి ప్రాణాలువదల బొజ్జమ్మ కన్నీరుమున్నీరుగ ఏడ్చుచుండ ఊరివారువచ్చి బొజ్జమ్మనోదార్చి బొజ్జన్న బొజ్జక్కలాంటి అన్యోన్య రజక దంపతులు యికరారు మావూరికంచు చేయునది ఇకలేదంచు వగచి వగచి తలచు చుండిరి దినదినమ్మునఊరి జనమంతా.....
దిగులు కొమ్మల్లో కోయిల
శతవర్షాల వేపచెట్ఙు నీడలో అరుగు మీద కూర్చొని సేదతీర్చుకుంటూ రోజెల్లి కబుర్లు చెప్పుకుంటూ కాలంగడిపేరు ఆఁ ఊరిజనాలు చెట్టుమొదల్లో కూచోని గ్రామదేవత చౌడమ్మ పొడుసు కొచ్చిన విశాలకాటుక కనుగుడ్లతో భీతి గొలుప దారినపోయేవారు భయపు మొక్కులు మొక్కుకొని వెళ్ళేరు ప్రతివసంతానికి వేపచెట్టు చిగురాకులేయ గ్రీష్మాన ఉక్కపోత ఎండవేడికి సేదనొంద జనాలొచ్చి మబ్బునీడన కూకొని కబుర్లుచెప్పుకొన ఆదేవత కూడ సంతోషాన మాటలుకలిపి మాట్లాడేది చిగురాకులు గిల్లుకొని తిన కోయిలలు వచ్చి మధుర కంఠస్వరాన పాటలుపాడ విప్పారిన చెవులతో ఆ దేవత వింటుండేది చైత్రానికి చెట్టుపూతేసి పిందలేయ ప్రియుడుతో కలిసొచ్చి కోయిల సుగంధపరిమళ పూలగుత్తుల సువాసన నాస్వాదిస్తూ కొమ్మరెమ్మల నెగురుతూ విహరిస్తూ యుగలగీతాలు పాడుతూ వేప పిందెల కొరికి తింటుండేవి ఎందుకోగాని గతమూడేళ్ళుగ వేపచెట్టు అగోచర కరోన కాటుకు చిగురించడం మాని ఆకేసినా అకాలంగా మాడిరాలిపోవ ప్రియుడులేక కోయిల దిగులుకొమ్మల్లోకూచొని కూయకుండ వెనుదిరిగిపోయె భీకర గ్రామదేవత నయనా లిపుడు చిన్నబోయి లొట్టపోయి కళతప్పి వృద్ధురాలివలె దిగులు చూపులనుండ అటుగా వచ్చిపోయే జనులు భీతివీడి మొక్కుటమానిరి సహజంగా.....
ప్రాణ భిక్ష పెట్టే చెట్టును ఎక్కిరిస్తున్నాడు
మనం జాతీయ రహదారుల విశాల విస్తరణలో ఎదిగిన చెట్లను నరికేసి పొట్టి చెట్లను, అలంకరణ పూల మొక్కలు నాటుతున్నాము. బెంగళూరు పట్టనము విషయంగా పురాతన మహా వృక్షాలను నరికి రోడ్డు విస్తరణ జరిగుచున్నది. అవుసరం వుంటే భవంతులను తొలగించి చెట్టును కాపాడాలి అంతేగాని వాటిని నాశనము చేయరాదు. వేపచెట్లు, ఎర్రటి పూలుకాసే గణేశ చెట్లు, వెడల్పు ఆకులుండే చెట్లు విస్తారంగా ఉండేవి. అవన్నీ నీడతోపాటు, వర్షాలు కురిపించేవే. గణేష్ చెట్ల పూల మొగ్గలో 5 నుంచి 10 వరకు నీటిచుక్క లంటాయి. గోండ్వాన కాలంలో గ్లోశాప్తరిస్, గంగమాప్తరీస్ లాంటి ఎత్తయినా మహా వృక్షము లుండి కాలాను గుణంగా కనుమరుగయ్యే ను. అదిమమానవుడు చెట్లతొ రలో జీవించాడు. తరువాత చెట్టుపై నివాస మున్నాడు.గుహలోఉన్నాడు. కొమ్మలు, ఆకులు, కలపతో చెట్ల కింద ఇల్లు కట్టాడు.ఈ నవీనమానవుడు చెట్లు నరక్కుంటూ గృహాపయోగ సౌకర్యనికి అవుసరానికి మించిన కలప వాడుతున్నాడు.ఒకనాటి మనిషి అడవిలోని ఎత్తయిన చెట్టునెక్కి తన గుడిసెల ఊరుని తిలకించి ఊరికి వచ్చే అపాయన్ని పసిగేట్టేవాడు. నేడు పొడుగాటి చెట్లు పొట్టివయినాయి. నేలనతుక్కొని నిర్మించిన ఇండ్ల స్థానే బహుళ అంతస్తుల మేడలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకనాడు మెడ ఎత్తి చెట్టు ఎత్తును చూడలేక పోయిన వ్యక్తి నేడు చెట్టు ఎత్తును మించిన భవంతినుంచి కిందున్న మరుగుజ్జు చెట్లను చూసి నన్నుమించిన ఎత్తు నీవు ఎదగజాలవని తనకు ప్రాణభిక్ష పెట్టె చెట్టును ఎక్కిరిస్తున్నాడు.నేడుగాక రేపు గోండ్వాన కాలంలాగా ఈ ఆకాశ హైర్మా భవంతులు భూగర్భంలో కలిసి పోక తప్పదేమో.... ~~~~~~
సమాజంలో ఆ నలుగురికి
ఈ సమాజంలో ఆ నలుగురు అన్నదమ్ములు కారుగాని అంతకంటే మిన్నయైన స్నేహబంధం వారిది నలుగురు రాత్రిపూట ఒకేచోట రోడ్డు పక్కన ఒకరికొకరు అతుక్కొని పడుకొని ఉదయాన్నే లేచి కాలకృత్యములు ముగించు కొని గోనె సంచులు సంకకు తగిలించుకొని ఎవరి దారిన వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి నాలుగు వీధులు తిరుగుతూ తిరుగుతూ కలవారి యిండ్ల ముందర వాడి పారేసిన చిత్తు కాగితాలు,సీసాలు,అట్టపెట్టెలు, ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరుకుంటూ,సంచుల్లో కూరుకుంటూ ఆ యింటి కాడ ఈయింటికాడ దొరికినంత అన్నము మెతుకులు తెచ్చుకొని పారేసిన సీసాల్లో వీధి కొళాయికాడ నీరు పట్టుకొని నాలుగురోడ్ల కూడలిలో చెట్టు కింద నీడ లో నలుగురు కలిసి ఆరాముగ కూర్చొని ఏరుకు తెచ్చుకున్న అట్టపేపరును పరచి దానిపై అక్కడక్కడ తెచ్చుకున్న అందరికూడు కలిపేసి పంచుకొని తిని ఆకలి తీర్చుకుని నీరుతాగి దిక్కుతోచక కాసించేపు చెట్టుకింద కూచొని బీడీముక్క వెలిగించి పొగ పీలుస్తూ సేదతీర్చుకొనే షికారీలకు వారి తల్లిదండ్రులెవరో తెలీదు దేశ జనాభా లెక్కల్లో వారి పేర్లుండవు ఈ దేశపు పౌరులని గుర్తింపు లుండదు ఏ ఆధారము లేని వారికి ఆధారుకార్డు ఎవరిస్తారు ఓటరుకార్డె లేని వారికి రేషను కార్డు లెవరిస్తారు వారికి తెలియని పర్యావరణ పరిరక్షణ దిశలో కష్టపడి చెత్త చెదారము నిస్వార్ధంగ తొలగించి సమాజసేవ చేసేవారికి ఈ సమాజము గుర్తిస్తుందా ఎలాంటి గుర్తింపు నిస్తుందో చెప్పండి గొప్ప సామాజిక సేవకులమని చెప్పుకొనే చోటాబడా నాయకులు నలుగురిని గుంపేసుకొని చెత్తాచెదారమును వారే రోడ్లపై వేయింపుకొని పొరకలు చేతబట్టి ఊడుస్తున్నట్లు ఫోటోలకు ఫోజులిచ్చి మహాత్ముని దారిలో నడుస్తున్నామంటూ ప్రజాసేవ చేస్తున్నామంటూ మభ్యపెట్టి పేపర్లో పెద్ద పెద్ద ఫోటోలు వేయించుకొనే వారికిచ్చే అవార్డులు రివార్డులు వీరికి రావేల వారు చేసిన గొప్పేమిటో వీరు చేయందేమిటో ఈదేశపు సామాన్య సగటు మనిషికి గల గుర్తింపు వీరికి కలిగించిన అదే పదివేలు.
Kavithalu
అన్నదానం (సేకరణ )
శ్లో|| అన్నదః ప్రాణదః ప్రోక్తః ప్రాణదశ్చాపి సర్వతః తస్మా దన్న ప్రదానేన సర్వదాన ఫలం లభేత్ ॥ అన్నం తినడం వల్లనే ప్రాణం నిలబడుతోంది. కాబట్టి, అన్నం పెట్టిన వాడు ప్రాణంపోసినవాడితో సమానుడుగా చెప్పబడుతున్నాడు ప్రాణాన్ని మించింది మరేది లేదు కనక - అటువంటి ప్రాణం నిలిపే అన్నదానం వల్ల అన్ని దానాలూ చేసిన ఫలం లభిస్తుంది. అందువల్ల యెల్లవేళలా అన్నదానం చేయాలి, పాత్రతా పాత్రతల నెరిగి మరీ అన్నదానం చేయాలి. ఎందుకంటే - చేసిన అన్నదానం వలన కలిగిన శారీరక శక్తితో అతడాచరించబోయే పాప పుణ్యాలలోసగభాగం-ఈ అన్నం పెట్టిన వాడికి చెందుతోంది. అందువల్ల పుణ్యకర్మాచరణ చేసేవారికి అన్నదానం చేయాలి. కాని, యెంత పాపాత్ముడైనా సరే - ప్రాణావసానవేళ - అన్నంలేని కారణంగానే మరణించేలా వున్నప్పుడు అన్నం పెట్టడం వలన అతడు బ్రతుకుతాడనే విషయం దృఢమైనప్పుడు - ఖచ్చితంగా వాడికి అన్నదానం చేయవలసిందే. పాత్రాతా పాత్రతల్నీ పాప పుణ్యాల్నీ తుంగలో తొక్కేసి 'ఆకలిగొన్నవాడికి అన్నంపెట్టి తీరాలి'. నిష్కల్మషంగా అన్నదానం చేసినవాడు, స్వర్గంలోని నందనవనంలో, పారిజాత వాటికలో, కల్పవృక్షాల నీడల్లో ఆ కల్పాంతం ఆనందిస్తాడు. ~~~~~~~~~~~~~~~~~~~~~~ .
వినదగు మంచి నెవ్వరుచెప్పిన
(A) 1. పూలదండ కట్టాలంటే పూలుకోయాలి, కాని చెట్టును తుంచకుాడదు.పూలమక రందాన్ని తుమ్మెదగ్రోలును కాని పూల రేకులను తుంచదు.అటులనేబొగ్గుల కోసరమని చెట్టు మొదలువరకు నరక కూడదు.ఏది ఎంత అవసరమో అంతవరకే ఉపయోగించాలి. 2. పండని పండురుచించదు,దానివిత్తనము పనికిరాదు.పండినపండు బాగుంటుంది , విత్తనముకూడ చెడదు.భూమిలోపాతిన మొలక వస్తుంది.గుణాన్ని బట్టే కార్య సాఫల్యమయ్యే విధముకూడ అట్టిదే. 3. ఈర్ష పడేవాడు ఏరోగంలేకున్నా దీర్ఘరోగం తో బాధపడే వాడివలె మరణకాలము వరకు లోలోన మదనపడు తుంటాడు. 4. బుద్ధిశాలి ఎదుటి వారికి మేలైనవి ఇష్టమైనవి సంతోష కరమైనవి ఎంతోమంచి వైనవి అయిన మాటలు మాట్లాడితనపనులు చక్కదిద్దుకుంటాడు అవివేకి ఊరికే నోరుపారేసుకొని కావలసిన పనులను చెడగొట్టుకొను. 5. పొసగని మాటల వలన పగ ,కలహం, పాపగతులు కలుగుతాయి.పొసగే మాటల వలన స్నేహం, జ్ఞానం,ధర్మం ,అభ్యుదయం కలుగుతాయి. 6. కృతఘ్నుడి శవాన్ని తినడానికి కుక్కలు సైతం అసహ్యహించు కోకుండవుండజాలవు. 7. దఃఖము వలన మనిషికి బలం నశిస్తుంది, ఆకారం చెడుతుంది,మనస్సుపాడవుతుంది, రోగం వస్తుంది.దఃఖంతో కృశిస్తేశత్రువు సంతోషిస్తాడు 8. ఒకేచెట్టువుంటే దాన్ని జంతువులు పాడుచేస్తాయి లేకుంటే గాలి కూల్చివేస్తుంది. ఒకేచోట సమూహంగా వుంటే ఒకదానికొకటి కాపాడ బడతాయి.అట్లాగె సంసారంలో అన్నదమ్ములు ఒకటిగావుంటే ఎవరికైనా అసాధ్యులే.అట్లకాకుంటె శత్రువుకు లోకువవుతారు 9. 9.నీళ్ళలో అగ్నిపుట్టడం(అగ్నిపర్వతం పేలడం)అనేద ఎలాంటి వైపరీత్యమో శత్రువులే లేనివానికి కోపమురావడం అటువంటి వైపరీత్యాన్నే కలుగజేస్తుంది. 10. ఆకాశాన్ని తాకే పొడవున్న మనుష్యుడిని నీపొడవెంత అని అడగటం దేనికి? ~~~~~~~~~~~~~~~~~~ (B) 1. వేటకాడు వేటకుక్కలకు బదులు సింహాన్నే తీసుకొని వేటకెలితే ఎవరైన ఏమని ప్రశ్నించగలరు. 2. మన శరీరసౌష్ఠవం మన ఆరోగ్యాన్ని నిర్ధారించలేదు మన ఆహారనియమాలు వ్యాయామాలే శరీర ఆరోగ్యాన్ని నిర్ధారిస్తాయి మరియు కాపాడుతాయి. 3. అనుభవము ఆశయాలు తపన ఆచరింప దగిన వైన గాలిమేడలు కట్టడానికి ప్రయత్నిస్తే అవి కూలిపోవచ్చు లేక మధ్యలో నిలువలేక పోవచ్చును కదా! 4. నీవుండటానికి నివాసముకోసం ఒక గృహాన్ని నిర్మించుకోవాలంటే ఆగృహనిర్మాణ కార్మికుల రుణము నీవుతీర్చుకొని వుండాలి. 5. నీకు మిగులుగా గల ధనము ఎంతదైన అది నీ ఒక్కడిదేకాదు ,పదిమందికి సంబంధించినదై వుంటుంది కనుక దానిని కష్టకాలములో అవుసరమున్నంత వరకు అందరికి పంచాలి. 6. ఎవరితోను దీర్ఘకాల శత్రుత్వం తగదు. పగపట్టిన మనిషి నిత్యము దుఃఖముతో పడుకుంటాడు. శత్రుత్వ మేర్పడితే పామున్న యింటిలో కాపురమున్నట్లే. ఒకతడవైనా నిమ్మళంగా ఉండలేరు. 7. పగవున్న మనసు పాముపుట్టవున్న ఇల్లువంటిది.పగ ఒకసారి మనసులో ప్రవేశిస్తే శాంతి వుండదు. పగను (పుట్టను) తొలగించడం తప్ప వేరమార్గములేదు. 8. పగగొన్నవాడు పగవలన తిరుగబడ కుండా ఊరుకొనబోడు 9. మనిషి నిలబడినా భవంతినికట్టినా దాని నీడ నేలపై పడుతుంది కాని చెట్టునుబతికిస్తే నీడతో పాటుగ గాలివీస్తుంది ప్రాణవాయువు నిస్తుంది ఫలాలనిస్తుంది జంతుపక్షిజాలములకు ఆశ్రయ మిస్తుంది. చివరకు కలపనిస్తుంది. 10. రోగి తనరోగ లక్షణాలను తనబాధను వైద్యుడికి వెల్లబుచ్చుతాడు అంతేకాని బాధనివారణ వైద్యుడి కర్తవ్యం.చికిత్స విధానము ఆయనదే అవుతుంది. ~~~~~~~~~~~~~~~~~ (C) 1. పగ కలిగిన మనసు పాములపుట్టలున్నఇల్లువంటిదని పెద్దలవాక్కు. 2. ఎన్నిపాట్లుపడి వ్యవసాయంచేసినా తగినసమయంలో పడినవర్షంవలననే పంటపండుతుంది.అట్లాగె ఎవరెన్ని ప్రయత్నాలు జేసినా ఆసమయానికి దేవుడు ప్రసన్నుడైతేనే అవి ఫలిస్తాయి. 3. ఒకడు తొందరపడి గోవుని కొడితే మరొకడు దానిదూడను కొట్టాలా అంటే కొందరు ఇతరులను కష్టాలపాలు జెేస్తే ఇతరులు వారిని కష్టాలపాలు చేయాల? 4. ఇదినాది అనేదానికి నీవు విలువ నివ్వకుండ ఇదినాదికాదు అనే దానికి విలువ నిస్తూపోతే నీవు నీజీవితాన్ని సంతోషంగా గడప గలుగుతావు. 5. పక్షిజంతు జాతులను వేటాడి చంపిన కఠినమైన శిక్షలూవున్నాయి మరి నరరూప రాక్షుసులను శిక్షించడానికి కఠినమైన శిక్షలెందుకు అమలు కావడము లేదెందుకు? 6. నీచుట్టూతా వున్న వారంత నీమేలుకోరే వారనుకోవడం అవివేకం వారిలో నీకు కీడు తలపెట్థేవారు ఎందరోవుంటారని తెలుసుకో. 7. ప్రాణముపై తీపి చావుపై భీతి మనిషి కుండకూడదు.పుట్టిన తరువాత మరణం ఎప్పుడైన ఎలాగైనా సంభవమే. 8. అగ్నిని వస్త్రములో కట్టలేము వాయువును పిడికిలో బంధించ లేవు. కార్చిచ్చును చేతిలో నల్చలేము భగ వత్ స్వరూపుల బంధింప నెవరికైన సాధ్యమా? 9. ఇంత వయస్సు వచ్చేవరకు ని న్ను కాపాడుతూ సుఖ జీవింప జేసిన భగవంతుని ఇంకొంత కాలం సుఖజీవనం గావింప జేయమని కోరుకోకు.ఏది ఎంతవరకూ అంతే. 10. నీకు నీవుగానే గొప్పవాడ ననుకొని ఇతరులు నీ గొప్పదన్నాన్ని గుర్తించాలను కోవడం అవివేకమే అవుతుంది. ~~~~~~~~~~~~~~~~ (D) 1. వేటకాడు వేటకుక్కలకు బదులు సింహాన్ని తీసుకొని వేటకలితే ఎవరైన ఏమని ప్రశ్నించగలరు. 2. మన శరీరసౌష్టవం మన ఆరోగ్యాన్ని నిర్ధారించలేదు మన ఆహారనియమాలు వ్యాయామాలే శరీర ఆరోగ్యాన్ని నిర్ధారిస్తాయి మరియు కాపాడుతాయి. 3. అనుభవము ఆశయాలు తపన ఆచరింప దగిన వైన గాలిమేడలు కట్టడానికి ప్రయత్నిస్తే అవి కూలిపోవచ్చు లేక మధ్యలో నిలువలేక పోవచ్చును కదా! 4. నీవుండటానికి నివాసముకోసం ఒక గృహాన్ని నిర్మించుకోవాలంటే ఆగృహనిర్మాణ కార్మికుల రుణము నీవుతీర్చుకొని వుండాలి. 5. నీకు మిగులుగా గల ధనము ఎంతదైన అది నీ ఒక్కడిదేకాదు, పదిమందికి సంబంధించినదై వుంటుంది కనుక దానిని కష్టకాలములో అవుసరమున్నంత వరకు అందరికిపంచాలి. 6. ఎవరితోను దీర్ఘకాల శత్రుత్వం తగదు. పగపట్టిన మనిషి నిత్యము దుఃఖముతో పడుకుంటాడు. శత్రుత్వ మేర్పడితే పామున్న యింటిలో కాపురమున్నట్లే. ఒకతడవైనా నిమ్మళంగా ఉండలేరు. 7. పగవున్న మనసు పాముపుట్టవున్న ఇల్లువంటిది. పగ ఒకసారి మనసులో ప్రవేశిస్తే శాంతివుండదు.పగను (పుట్టను) తొలగించ డంతప్ప వేరమార్గములేదు. 8. పగగొన్నవాడు పగవలన తిరుగబడ కుండా ఊరుకొనబోడు. 9. మనిషి నిలబడినా భవంతినికట్టినా దాని నీడ నేలపై పడుతుంది కాని చెట్టునుబతికిస్తే నీడతో పాటుగ గాలివీస్తుంది ప్రాణవాయువు నిస్తుంది ఫలాలనిస్తుంది జంతు పక్షిజాలము లకు ఆశ్రయమిస్తుంది చివరకు కలప నిస్తుంది. 10. రోగి తనరోగ లక్షణాలను తనబాధను వైద్యుడికి వెల్లబుచ్చుతాడు అంతేకాని బాధనివారణ వైద్యుడి కర్తవ్యం. చికిత్స విధానము ఆయనదే అవుతుంది. ~~~~~~~~~~~~~~~~~~~~ (E ) 1. సమర్థుడై ఉండికూడా తన దేహంతో, ద్రవ్యముతోతన తల్లి దండ్రు లకు సేవచేయడో, అట్టివాడు కష్టుడు.వాడు చచ్ఛిపరలోకంలో తన శరీరమాంసం తానే తినేవాడవుతాడు 2. ఏ మానవుడు తలిదండ్రులనూ, వయో వృద్ధులనూ, చిన్నబిడ్డలనూ, గురువులనూ, బ్రాహ్మణులనూ, సాధువులనూ, ఇల్లాలు మొదలైనవారినీ సమర్థుడై ఉండికూడా పోషించక దీనాలాపాలాడుతాడో అట్టివాడు ఈ భూమిమీద బ్రతికియూ చచ్చినవాడేనట. 3. ఎవరినైనాచేయిపట్టుకొని ఆదరిస్తే రాజు అతణ్ణి సన్నిహితుడుగాభావిస్తున్నాడనటానికి సంకేతమట. 4. తులసిలక్ష్మీదేవిస్వరూపమట.సరస్వతీదేవి శాపంవల్ల లక్ష్మీదేవి తులసిగా మాధనీ ధర్మధ్వజులకుకుమార్తెగాజన్మించిందట.శంఖచూడుని రూపంలో విష్ణువు ఈమెను వివాహమాడాడట.(బ్రహ్మవైవర్త పురాణం) 5. ప్రాణుల జ్ఞానేంద్రియాలు ఇహలోక సంబంధితపనులుమానివేసి, పరలోక సంబంధ పనుల వైపు మల్లితే ముక్తికి దగ్గరై నట్లేనట. 6. అతిథులు వస్తుానే'క్షేమం' అడగటం మనసంప్రదాయం.ఆ సంప్రదాయాన్ని కృష్ణుని నోటివెంట పదేపదే పలికించడంవల్ల అందరూ ఆమర్యాదను పాటించాలి అని ధ్వని . 7. సాయంసంధ్యలుపొద్దుకుంకేసమయాన్ని'అసురసంధ్య'అంటారు.అలాగే వేకువజాముకు ముందు అసురులు సంచరించే వేళ అంటారు.ఆసమయాల్లో ఏశుభకార్యాము జేయరు. 8. 8లోకంలో ప్రాణి తాను చేసిన కర్మకు తగిన జన్మనే ఎత్తుతోంది. కర్మచేతనే పెరుగు తోంది. కర్మచేతనే నశిస్తోంది.కాబట్టి ఆ కర్మమేమను యష్యులకు దేవత.ప్రాణులసుఖదుఃఖాలకు కూడా ఆ కర్మయే మూలం. కర్మాచరణం చేసేవాని కర్మలకు తగిన ఫలాన్ని ఇవ్వడానికి ఈశ్వరుని అవసరం ఉందనుకుంటే అతనుకూడ కర్మలుచేసినవానికే ఫలం కలిగిస్తాడు. వాస్తవానికి కర్మసంబంధం లేని యీశ్వరుడు కూడా కర్మ చేయనివానికిఫలమీయలేడు. 9. వర్షానవరుణుడూ,షడ్గుణైశ్వర్యసంపన్నుడూ అయిన దేవేంద్రుడు ఈ యాగానికిఅధిపతి, ఆంధ్రుడికి ప్రియమైన అతని ఆజ్ఞచేత నేలమీద వానలుకురుస్తాయి. సర్వజీవులకూఆప్యాయనం కలిగిస్తాయి.ఆనీటివల్లపంటప్రజలకుధర్మార్థ కామాలు సిద్ధిస్తాయి. ఈ సంగతి అంతా ఎరిగిన రాజులు, లోకంలో ఇంద్రయాగం చేస్తూఉంటారు. ఎవరైనా కామలోభ భయద్వేషాలకుఅతీతులుకారు. యాగాలవల్ల వాటిని అదుపులో నుంచవచ్చు. 10. ఇంద్రయాగంచేస్తే ,దేవేంద్రుడు సంతోషించి వానలు కురిపిస్తాడు. వానలుకురిస్తే భూమి మీద గడ్డి పెరుగుతుంది. ఆగడ్డిని మేసి ఆలమందలు బతుకుతాయి. పాడి కలుగుతుంది. పాడి వలన మానవులు జీవిస్తారు. 11. చెట్లుఎంత గొప్పవో తమకు కీడు తలపెడదామని వచ్చినవారికికూడా కీడు చేయవు. ఎవరికి సంబంధం లేకుండా ఏకాంతంగా పెరిగి ఉన్నాయి. ఎండ, చలి, వానలనుండి ప్రజల్ని కాపాడుతున్నాయి. వారికి అవసరమైన బెరడు, గంధం, జిగురు,బూడిద,చిగుళ్లు,తేనె,పూలు, పండ్లు,మూలికలుఅందించి నీడలు ఇచ్చి ఆదుకుంటాయి. అటువంటి వృక్షాలనుమనుజుడు కాపాడుకోవాలి. ~~~~~~~~~~~~~~ (F) 1. వేటకాడు వేటకుక్కలకు బదులు సింహాన్ని తీసుకొని వేటకలితే ఎవరైన ఏమని ప్రశ్నించగలరు. 2. మన శరీరసౌష్టవం మన ఆరోగ్యాన్ని నిర్ధారించలేదు మన ఆహారనియమాలు వ్యాయామాలే శరీర ఆరోగ్యాన్ని నిర్ధారిస్తాయి మరియు కాపాడుతాయి. 3. అనుభవము ఆశయాలు తపన ఆచరింప దగిన వైన గాలిమేడలు కట్టడానికి ప్రయత్నిస్తే అవి కూలిపోవచ్చు లేక మధ్యలో నిలువలేక పోవచ్చును కదా! 4. నీవుండటానికి నివాసముకోసం ఒక గృహాన్ని నిర్మించుకోవాలంటే ఆగృహనిర్మాణ కార్మికుల రుణము నీవుతీర్చుకొని వుండాలి. 5. నీకు మిగులుగా గల ధనము ఎంతదైన అది నీ ఒక్కడిదేకాదు, పదిమందికి సంబంధించినదై వుంటుంది కనుక దానిని కష్టకాలములో అవుసరమున్నంత వరకు అందరికిపంచాలి. 6. ఎవరితోను దీర్ఘకాల శత్రుత్వం తగదు. పగపట్టిన మనిషి నిత్యము దుఃఖముతో పడుకుంటాడు. శత్రుత్వ మేర్పడితే పామున్న యింటిలో కాపురమున్నట్లే. ఒకతడవైనా నిమ్మళంగా ఉండలేరు. 7. పగవున్న మనసు పాముపుట్టవున్న ఇల్లువంటిది. పగ ఒకసారి మనసులో ప్రవేశిస్తే శాంతివుండదు.పగను (పుట్టను) తొలగించ డంతప్ప వేరమార్గములేదు. 8. పగగొన్నవాడు పగవలన తిరుగబడ కుండా ఊరుకొనబోడు. 9. మనిషి నిలబడినా భవంతినికట్టినా దాని నీడ నేలపై పడుతుంది కాని చెట్టునుబతికిస్తే నీడతో పాటుగ గాలివీస్తుంది ప్రాణవాయువు నిస్తుంది ఫలాలనిస్తుంది జంతు పక్షిజాలము లకు ఆశ్రయమిస్తుంది చివరకు కలప నిస్తుంది. 10. రోగి తనరోగ లక్షణాలను తనబాధను వైద్యుడికి వెల్లబుచ్చుతాడు అంతేకాని బాధనివారణ వైద్యుడి కర్తవ్యం.చికిత్స విధానము ఆయనదే అవుతుంది. ~~~~~~~~~~~~~~~~~~~~
నీతోనే నీ నీడగా వుండాలి నేనెప్పుడు
తెల్లవారక ముందే ఇంటి ముంగిట చేద బావిలో నీరు తోడ బక్కెట తాడు గిలక మీద వదలు తుంటే నీచేతులతో నాచేతులు కలిపి తాడు పైకి లాగి నీరుతోడ సాయపడాలని వుంటుందినాకు పొలంలో విత్తనమువేయ కాడెద్దుల మెడపై మడకేసుకొని పొలానికి నీ వెలు తుంటే నీ వెనకాలేవచ్చి పొలములో నీవుదున్నే మడకసాలను చుాడాలనుంటుంది నాకు పంట చేనులో పైరు కంకిగింజలేయ పంటకాపాడు కోవ మంచవేయసాయపడత మంచె పై నీతో పాటుగా నిలబడి వడిసె తిప్పి రాయి విసురుతూ పంటచేను నేనూ కాపాడతా పంటకోతకు రాగ కంకిజల్ల నడుముకు కట్టి కోత కొడవలితో కంకికోసి బుట్టలోకివేస్తుంటే ఆ కొడవలి చేత బట్టి నేనూ కంకినికోసి బుట్టలోకివేస్తూ నీతోపాటు ఆ నందపడుతా రేపటి వంటకు కట్టెలులేవని నీ ఆలిది చెబితే కొండకట్టెలేరి మోపుకట్టి నెత్తినెట్టుకొన కష్టపడ చూడలేక నీకష్టమేనాకష్ట మనియెంచి నీ చేతులకు నాచేతులు కలిపి సాయపడత ఇంటికొచ్చినీవెలితెనిన్నువెన్నంటి వుండ ఇంటిగుమ్మాన నిలబడిపోతిని నేను కడదాక నీచెలిమిని కోరి నీతోటి వాడ నై నీతోనే నీ నీడగా వుండాలి నేనెప్పుడు..... **** సూక్తులు :
నీడనివ్వని చెడు చీకట్లో
ఆకాశంలో మేఘుముంటే భూమిపై దాని నీడ పడుతుంది మేఘము కదిలితే ఆ నీడ కదులుతుంది కాని అవి రెండు ఎప్పుడూ కలవవు దేని ప్రయాణం దానిదే ఎల్లప్పుడు గాలి వీచి మేఘము కనుమరుగయితే భూమిపై దాని నీడ కనుమరుగవుతుంది ఇప్పుడు మనిషి విషయానికి వస్తే మనిషి నీడ తను నిలబడితె నిలబడుతుంది నడిస్తే నడుస్తుంది,పడుకుంటే పడుకుంటుంది, అలా తనను అంటిపెట్టుకొని వెన్నంటేవుంటుంది చివరిదాక నీడ వెంటాడడమనే పై రెండుక్రియలు వెలుతురు అనే మంచి తనం మన చుట్టూవున్నప్పుడే సాధ్యం చీకటి యనే చెడువ్యాపిస్తే నిన్ను వెన్నంటి వుండే మంచియనే ఆనీడలు కనిపించవుకదా అందుకే మనిషన్న వాడు వెలుతురు యనే మంచి లోనే ప్రయాణిస్తూ జీవించాలి ఎల్లప్పుడూ లేనిచో నీడనివ్వని చెడు చీకట్లో గుడ్డివానివలె జీవించాల్సి వస్తుంది... ******
కాలంతోపాటు చెల్లదు కవితకు కాలం
కవికి కాలంతో పనిలేదు కాలం కదలి పోతున్నట్లు కవిత్వం కదలి పోతుంటుంది కాలాన్నే కలం జేసుకొని కవితలల్లేను కవి అన్నికాలాల్లో వసంతంలో ఆకులు పండుబడి రాలి పచ్చని ఆకులతో చిగురించి చెట్లుయవ్వనత్వంపొంది పూలుపూసి కాయలు కాసి పండుపడునంచు కవిత్వీకరించుకవి గ్రీష్మములో ఎండలుమెండై వడగాలులు వీచి ఎండమావులు పరుగిడుతుండ పక్షి జంతుజాలములు చెట్లనీడజేరి సేదతీర్చుకొనునంటాడుకవి వర్ష శరధృతుకాలాల్లో మేఘాలుమెండై ఆకాశాన్నిఆవహించి గాలులువీచమేఘాలకు చిల్లులు పడి కుండపోత వర్షాలకు వరదలు ముంచెత్త జనజీవనం అతలాకుతలమైనట్లు ఆర్తనాదాలు వినిపిస్తాడు కవి హేమంత శశిరాల లో తుంపరతుంపరవర్షాలతోచలిమొదలై ఈదురుగాలులువీయచలిమెండై చలి పులిలావెంటబడిందంటూ చలినుండి కాపాడుకొన ప్రకృతి తనకుతాను మంచు దుప్పటి కప్పుకొనె నంటాడు కవి సీతలత్వాన స్వర్ణ కైలాసం మంచుపొరకప్పి రజతమాయె కీకారణ్యంలో హోరుమని శబ్దించే జలపాతాలు మంచుగడ్డకట్టి నిశ్శబ్ద మవ్వ పక్షుల కిలకిలారావ కంఠస్వరాలు కర్ణానందంగ వినమంటాడు కవి విపంచి తీగలు వినిపించే సంగీతభావరిలా నదులు పారుతుండ నీటియడుగున గులకరాళ్ళు మృదంగశబ్దాలైదొర్లుతుండ వనుకుపుట్టే చలికి వీణతీగలుతెగి రాళ్ళమృదంగ శబ్దాలు ఓటుపోయి పాటకు లయతప్పె నంటాడు కవి చెట్ల ఆకులపై దట్టంగ మంచుకప్ప అదిప్పుడు పచ్చదనాన్ని కప్పియుంచ అవిప్పుడు వయసు మల్లిన ముదుసళ్ళ కేశరాల్లా మెరెసె నంటాడుకవి చెట్లపై చిందులేసే వానరాలు గుంపులు గుంపులుగా దగ్గరికిజేరి ఒకదానికొకటి కరుచుకొని కూచుండి శరీరోష్ణోగ్రత నొక్కొకటి పంచుకొని చలితీవ్రత నతిక్రమించి నిదిరించెనంటు చమత్కీకరించు కవి ఎడారిన సంచరిస్తూ తోడునుపొందకోరి సింహం కోపాన పదేపదే గర్జించినా నోట నిప్పులురవ్వలు కక్కలేదుగాని చలికి గర్జించనోటిన పొగలువచ్చునంచు కవిత్వీరించెకవి ఇలా కవికలం వరదల్లోకొట్థుకుపోక చలికి గజగజ వనకక ఎండతీవ్రతకు కలమున శిరా ఎండిపోక గాలికి చెట్టులా ఊగిపోక ధృఢత్వమున అన్నికాలాలలో చివరి వరకుకవి తనకలమును ఝలిపించి కవిత లల్లుచునుండు పండిన ఆకురాలికిందపడినట్లు కాలంతీరి కవి తన తనువుచాలించినా కాలంతో పాటు చెల్లదు కవితకు కాలం వసంతంలో పూసేపువ్వులా అందరిచే నిత్యం ఆకర్షింప బడి మెప్పు పొందుతుండు సత్యమై..... ~~~~~~~~~~~~~~~~~
అట్లామాట్లాడి దిగులెట్టుకోకె
ఈ కొండగట్టు చేన్లోకి మేము కూలిపనికంటొచ్చి గడ్ది కలుపు తీస్తూనెత్తి మీదికి సూరుడొస్తే పైటాలపొద్దు ఆకలేసి సద్ది కూడుతిన ఈమాను నీడ చేనుగట్లపై కూకుండి నెత్తెట్టుకోని తెచ్చుకున్న సద్దికూడుమూట చన్నీళ్ళతో తడిపి లోనున్న రాగిసంగటి సగానికి తుంచుకొని అందున్న ఎర్రగోంగూరూరి మిండితో గొంతులోకి దిగమింగుతూ కష్టనష్టాల కడలి మాటలతో నవ్వుకుంటూ నిట్టుార్పులిడిసేము మనిద్దరికి మాటమాట పరిచయాలేర్పడి అమాయకక ళ్ళ ల్లోకళ్ళుపెట్టిచూసుకొని మనసులు కలిసి నన్నుమనువాడి ముప్పై ఏండ్లపొద్దునీతోతెలియకుండ ఎలా గడిచిందోగదా మామ అవునే లచ్చిమి ఈ కూలినాలితోనే బతుకెల్లీదుతూపిల్లలపెంచిఊరిచావిడి బల్లోచదివించిపెద్దోళ్ళజేసిఊరోళ్ళకు అప్పుల్లేకుండపెళ్ళిళ్ళుజేత్తిమి పెదబిడ్డ కూలోనికియాలైందినాకునీలాగ నీవుసుఖపడలా నదికష్టంలోఎల్లీదుతుండె భూమున్న మగోడొచ్చిచిన్నదాన్కిపరవాలె నీముద్దులకొడుక్కి గవర్నమెంటోళ్ళ బంట్రోతు నౌకరు పనొచ్చి పట్నంజేరె పెండ్లాంతో ఈకొండగట్టు చేన్లో కలకాలం కూలిపనితో ఎల్లీద ఈచెట్టు నీడె గతాయె మనిద్దరికి అదేంటి మామ అట్టామాట్లాడి దిగులెట్టుకోకె ఈగట్టు చేనికాడ కష్టమే మనిద్దర్ని కలిపింది దీని నీడలో చల్లంగ నీతో గడుపుతూ ఈనేల్లో కలిసిపోతే అదేచాలు నాకుచివరి వరకు.. ***
అట్లామాట్లాడి దిగులెట్టుకోకె
ఈ కొండగట్టు చేన్లోకి మేము కూలిపనికంటొచ్చి గడ్ది కలుపు తీస్తూనెత్తి మీదికి సూరుడొస్తే పైటాలపొద్దు ఆకలేసి సద్ది కూడుతిన ఈమాను నీడ చేనుగట్లపై కూకుండి నెత్తెట్టుకోని తెచ్చుకున్న సద్దికూడుమూట చన్నీళ్ళతో తడిపి లోనున్న రాగిసంగటి సగానికి తుంచుకొని అందున్న ఎర్రగోంగూరూరి మిండితో గొంతులోకి దిగమింగుతూ కష్టనష్టాల కడలి మాటలతో నవ్వుకుంటూ నిట్టుార్పులిడిసేము మనిద్దరికి మాటమాట పరిచయాలేర్పడి అమాయకక ళ్ళ ల్లోకళ్ళుపెట్టిచూసుకొని మనసులు కలిసి నన్నుమనువాడి ముప్పై ఏండ్లపొద్దునీతోతెలియకుండ ఎలా గడిచిందోగదా మామ అవునే లచ్చిమి ఈ కూలినాలితోనే బతుకెల్లీదుతూపిల్లలపెంచిఊరిచావిడి బల్లోచదివించిపెద్దోళ్ళజేసిఊరోళ్ళకు అప్పుల్లేకుండపెళ్ళిళ్ళుజేత్తిమి పెదబిడ్డ కూలోనికియాలైందినాకునీలాగ నీవుసుఖపడలా నదికష్టంలోఎల్లీదుతుండె భూమున్న మగోడొచ్చిచిన్నదాన్కిపరవాలె నీముద్దులకొడుక్కి గవర్నమెంటోళ్ళ బంట్రోతు నౌకరు పనొచ్చి పట్నంజేరె పెండ్లాంతో ఈకొండగట్టు చేన్లో కలకాలం కూలిపనితో ఎల్లీద ఈచెట్టు నీడె గతాయె మనిద్దరికి అదేంటి మామ అట్టామాట్లాడి దిగులెట్టుకోకె ఈగట్టు చేనికాడ కష్టమే మనిద్దర్ని కలిపింది దీని నీడలో చల్లంగ నీతో గడుపుతూ ఈనేల్లో కలిసిపోతే అదేచాలు నాకుచివరి వరకు.. ***
"దిశా" చట్టాలెరుగని అట్టడుగుయువత - 24 (పసిపిల్లలపై అత్యాచారం)
సంస్కృతి సంప్రదాయాలు తుంగలోతొక్క 'హత్య'-పదం అచారమాయె నేటిసమాజంలో మోసం దగాకోరుతనం నేర్పిరితనమై చెడుసంప్రదాయానికి దారులాయె వక్రభాష్యపదజాలంతో సినిమా, టి.వి కార్యక్రమాలుచూచి యువతీయువకులకంటిచూపుల్లో వయసుకు మించిన కామపొరలుగప్పె పల్లెపట్టణమంచుతేడాలెరుగక సాంప్రదాయదుస్తులువీడి అంగాంగానికి అతుక్కున్నదుస్తులేసుకోగా మనసునకృత్తిమ ప్రేమలుపొడచూపె తల్లికడుపున పిండముండ జిహ్వచాపల్యాన సాత్వికాహారానికి స్వస్తిపలికి రాక్షసాహారం తిని పురిటిలోనేబిడ్డకు కృూరత్వబీజాలు నాటుకుపోతుండ చినవయసునే కోరికలకు అడ్డ దారులుపట్టించె అరచేత వైకుంఠంలా సెల్ ఫోనులు వెలయ అశ్లీలదృశ్యాలుచూచి కామపిశాచాలావహించ అదునుచూచి పసిబిడ్ధల మభ్యపెట్టి ఎత్తుకెల్లి అఘాయిత్యంజేసి ఆపై హ త్యచేసి భయముగొల్ప గుర్తించకుండ శవాన్ని పూడ్చిపాటిపెట్ట నిర్భయంగా సమాజంలో తిరుగాడె నిందుతులెందరో కదా! 'దిశా'చట్టా లెరుగని అట్టడుగు యువతవర్గాల్లో తప్పుజరిగిన తదుపరి చట్టంతెలిసొచ్చినా ప్రయోజనమేమిటి? చిన్నీడువయసుపిల్లల మనస్తత్వాల్లో నేరపూరిత భావజాలమెరిగి వారిలో సాత్విక చింతన పెంపొందింపజేసే స్వచ్చంద విద్యాసంస్థలు ముందుకురావలె లేనిచో ఈసమాజం ఏ దారినెంచుకొని పరుగిడుదుందోఎవరికెరుక? ~~~~~~~~~~~~~~
నాకవిత మరోమారు నవ్విందంటూ
చాల కాలం విరామం తరువాత నామనసుకు దోచె నేనొక కవితరాయాలని కలముకాగితముతో టేబుల్ ముందర కూచుంటిగాని ఎంతప్రయత్నించినా బుర్రకు ఆలోచన తట్టక హృదయం స్పందించక మనసున భావము కదలక చెత్తబుట్ట చిత్తుకాగితాలతో నిండె ఫ్యానుగాలివీచి గదియంత చెల్లాచెదరాయె ర్యాకులోనినాల్గుసాహితీపుస్తకాలు కిందికితీసి తిరిగేయఅందుంచి "నాకవిత నవ్విందంటూ"ఓ కవితను చదువడంమొదలెట్టా ,అదిలాసాగింది నీవుకవివి గావు నీలోసహజత్వంలేదు నాల్గు గోడలమధ్యకూచొనిపుస్తకాలుతిరగేస్తూ రాసే నీకవిత నాకక్కర లేదు పొద్దున్నే ఆలి కలిపిచ్చిన చల్లని అంబలితాగు కాసింత సద్దికూడు కట్టించుకొని పల్లెబస్సెక్కు ఓ ఊళ్ళో రచ్చబండకాడ దిగు పదిమంది ఊర్లోపెద్దలు కూచొనివుంటారు నేనొక కవినంటూ పరిచయం చేస్కో ఆఊరిపెద్దాయన నీకు తోడొచ్చి ఊరంతా కలియ తిప్పుతాడు గ్రామీణ మహిళ కట్టుబొట్టు చూడు మాట తీరుపలకరింపులు విను ఇంటిల్లిపాదివంటకాలనడిగితెలుసుకో వాకిలిముంగిటిరంగవల్లుల అందాల గొబ్బెమ్మలు చూడు రైతుపశులకొట్టంలో గాటిపాటున్న పేడగంజు తీసి గంపకెత్తుకొని ఊరిబయట దిబ్బలోకివిసిరితే అదిపంటలకు జీవరసాయన ఎరువ వుతుంది ఆవుగేదె మేక గాడిద కోడి కుక్క పిల్లి బాతు పందుల కదలికలు చూడు యువతీయువకులనోటి జానపదులువిను గ్రామీణ పండుగలగూర్చి చర్చించు ఊరిబయటికెల్లి ప్రకృతిని తిలకించు మట్టి ఇసుక రాయిరప్ప వాగువంకలజూడు గలగలపారే శెలఏరు శబ్దాల నాస్వాదించు చెట్లుచేమ, పంటపొలాల గాలి పీల్చు తేనెటీగల ఝంకారనాదము విను గాలిన ఎగిరి పరుగిడే తూనీగనుచూడు పంచరంగులసీతాకోక చిలుక చీరజూడు అది పూల మధురకాన్ని గ్రోలును చూడు ఎగిరేపక్షుల ఆటలుచూడు పాటలువిను, అడవి జంతువుల అరపులువిను పూదోటల్లో పండ్లతోటల్లో తిరుగాడు ఆకాశంలో మేఘ గమనాన్ని చూడు పరుగిడేమేఘాలనీడభూమినచూడు ఇలాప్రకృతినతిరుగాడునంత నీకడుపున పరుగిడేఆకలి గుర్రాలకేకలువినిపించు పంటకాలువ గట్టున కూకుండి ఆలి కట్టిచ్చిన సద్దిమూట నీటతడిపి విప్పి అరచేతిలోనిడుకొని తనివితీర తిని కాసింతసేపుచెట్టునీడనపడుకొని లేచి సాయంకాల పల్లెబస్సెక్కి నీవూరుచేరుకో ఇప్పుడురాయి పల్లెపల్లెకో కవితంటూచెప్పం గ నేను"నాకవిత మరోమారు నవ్విందంటూ"శీర్షికతో ఓకవితరాసిమెల్లగ నిదురలోకి జారుకున్నా....... ~~~~~~
చౌడమ్మ జ్యోతులకు వెల్లినారె - 22 ( రాయలసీమ ప్రాంత గ్రామదేవత చౌడమ్మ)
దీర్ఘ కవిత : 1. కార్తీక పున్నామినాడు చౌడమ్మా దేవాతాకూ జ్యోతులూ చేతమంటూ అమ్మమ్మా తాతయ్యాలు కబురూ పంపినారు ఆకబురుా తెలిసీకోనీ పిల్లా లందారూను సంతోషం పట్టాలేక గంతూ లేసినారు అమ్మమ్మా తాతయ్యాల ఊరూ వెల్దామంటూ అమ్మానాన్నాలముందర పిల్లాలు గోలాచేసినారు పిల్లాల కోరికమేర నేడే ప్రయణామంచు నాన్న బండీకట్టామంచు కబురుా పెట్టిీనా డు పాలేరుకు కబురూపంపినాడు *** 2. పశులా కొట్టాములోన గాడీపాటనున్న కోడేగిత్తాలకు వరిగడ్డి మేతవేసి నీరూ తాపుకోనివచ్చి ఎద్దులా బండీకి పాలేరుకట్టినాడు సవారుబండీకి కట్టీనాడు కోడేగిత్తాల మెడలకు రంగుటద్దాల పట్టీలుగల గలగంటాలూ కట్టుకోని రంగురంగుల నూలు కుచ్చుాలా దండాలుతెచ్చి ఎద్దులా కొమ్మూలాకుకట్టి సోకుా జేసినాడు పాలేరు సోకూచేసినాడు కాడెడ్లబండీని తెచ్చి ఇంటీముంగీట నిలిపి సవారు బండీలోన వరిగడ్డి పరుపుాపైన దుద్దూ కంబాలీతెచ్చీ కప్పి మెత్తగా పరచినాడు *** 3. పిల్లాలందారీకి స్నానాలు చేయించి చలువబట్టాలుతొడిగి తలలకు నూనెరాసిదువ్వి ముస్తాబుజేసి అమ్మ బండీనియెక్కి మీరు బుద్దీగా గూర్చోమంటూ బుకాయించి చెప్పినాదెఅమ్మ పిల్లాలందారునూ పరుగుా పరుగూన పోయి బండీ ఎక్కికూకున్నారు *** 4. సలవపంచ గోచిపైన తెల్లాతెల్లాని చొక్కాతొడిగి మూడూ రంగూల తుండుా టవాలుగుడ్డ భూజాన వేసుకోని తలవెంట్రుాకాలు దువ్వూకోని నుదుట యెర్రాని తిలకాముతోడ నామమూ దిద్దూకోనెనాన్న *** 5. అమ్మ నీలిరంగు పట్టుచీరాను కట్టి ఎర్రానిపూల రవికాను తొడిగి పొడుగాటి వెంట్రూకాల జడనుా యల్లుాకోని దాన్ని బిచడాగ చుట్టినాది అమ్మ బిచడాకొప్పుపైన గుండుా మల్లేల సొరముా గుచ్చుకోనె బిచడా కొప్పులోన రవ్వాల బిళ్లగుచ్చి ఎర్రా యెర్రాని కుంకుామా తిలాకాము నుదుటా దిద్దుాకొనె అమ్మ కాళ్ళమెడాలకు వెండీిగజ్జాల పట్టీలూ వెండీ కడియాలూ తొడుగూకోని బంగారుా దండాలు మెడనిండా వేసుకోని *** 6. దేవూని గుడీలోన దీపమూ పెట్టినాది అమ్మ తలవాకిలి గడాపాకు పసుపూ రాసినాది ఆపైన కుంకుమాల బొట్లూ పెట్టినాది అమ్మాచౌడమ్మా పసిబిడ్డాల తోలుకొని నీజ్యోతులాకు బయలూదేరి వస్తుంటీమి గదమ్మ మాయిల్లు భద్రంగా చూసూకొని దారి మధ్యాలోన ఆటంకాలు లేకుండా క్షేమంగ గమ్యామూచేర్చు తల్లీ చౌడమ్మాయంటూ మొక్కూకోని నాది సవారుబండీఎక్కి అమ్మోరు జ్యోతులాకు బయలుాదేరినాదె అమ్మ *** 7. బండీవాడు బండీనగాయెక్కి చర్నకోల పైకితీసి చల్ చల్ మంటూ కాడెద్దుాల వీపుపైన చురకా లంటినాడు అరచేతివేళ్ళతోడ తోకాలూమడిసిపట్టి హాయ్ హాయ్య్ంటు గట్టిగా గదిమి బండివాడు ఎద్దులదబాయించి అదిలించినాడు కాడేద్దులు దౌడుతీస్తూ గుండ్లబాటపైన పోవ ఇనుప పట్టీలచక్రాలు గుండ్లా రాళ్ళపైకీఎ క్కి ద డా ద డా మంటుపోవ సవారుబండితడిక అటూయటూ కొట్టూ కొనె ఈబండీ ప్రయాణాము కంటె కాలినడకా మేలని కోపముచేసుకొని అమ్మ బండీవాడితోడ మెల్లంగాతోల మంటూ కోపామూజేసు కొని బుకాయించి నాదిఅమ్మ *** 8. చేసేది ఏమిలేక అట్లాగె తోలుదునమ్మా యంటు ముందుకూ తోలినాడు బండీని ముందూకు తోల చింతాపోతన్న గుడులువచ్చె చింతాపోతన్నాకాడ చిత్రావతీ నదీఒడ్డున చింతాచెట్టునీడన బండీనగాలు దించి కాడెద్దుల తోలుకోని చిత్రావతినదిలో నీళ్ళుతాపినాడు చింతచెట్టుా నీడలోన ఎద్దుల ముక్కుతాడు కట్టీవేసి సవారు బండీలోని వరిగడ్డీమోపు తీసి ఎద్దూలాకు మేతవేసినాడు బండోడు తలకూచుట్టూకున్న తుండుా టవాలు పరచుకోని చెట్టూనీడాన కునుకుతీసినాడు *** 9. చింతచెట్టూ అరుగుాపైన దుద్దూకంబాలిపైన అందరికి విస్తర్లువేసి సద్దీమూట విప్పి పప్పన్నాము వూరగాయ దద్దోజనాలు వడ్డానచేిసె అమ్మ పిల్లాలుమొగూడు కడుపార తినాగానె బండీవాడికి పెట్టి తానూతిన్నాదె ఆమ్మ మిగిలీన అన్నాలు కూరలు దారీనపోయె కూలిజనానికి పెట్టినాది అమ్మ పెట్టిన యన్నాముతిని రైతుాకూలీలు చల్లంగవుండుతల్లియంటూ దీవించివెల్లినారు చిత్రావతినదీ పంటాకాలువలోన అందరూ చల్లనినీరుతాగ బండివాడు ఎద్దులకునీరుత్రాపి బండీ సిద్దమూచేసినాడు *** 10. నదినీటి ఇసుకలోన బండీని ఈడ్వగలేక ఎద్దులకు గసాపుట్టినాది నాన్నపిల్లా లందరు బండీదిగితోసినారు నదిలోనడిచివచ్చి ఒడ్డునా బండియెక్కి ప్రయాణం సాగించినారు తాతయ్యఅమ్మమ్మల ఊరుజేరుకోంగ దీపాలపొద్దూకునికే వేలాఆయె *** 11. తాతయ్యఅమ్మమ్మల ఇల్లంతసంద డాయె మనవరాండ్ర మనవళ్ళాను అక్కునజేర్చుకొని అమ్మమ్మతాతయ్యలు ముద్దాడినారు వెండి పళ్ళెరాములోన పూలుపండ్లు నింపుకోని బాజాభజంత్రీల తోడ బంధుజనుల తోడ చౌడమ్మగుడికి బయలుదేరినాది అమ్మ గుడిముందార జమ్మీచెట్థుాకి తిరిగి గుడిలోన చౌడమ్మకు పూజాలూచేసికోనినాది అమ్మ వర్షాలుబాగవచ్చి చెరువూలునిండి పాడిపంటాలతోడ జనులెల్ల చల్లంగుండాలంటూ మొక్కు కున్నాదెిఅమ్మ చౌడమ్మకుమొక్కుకున్నాదె *** 12. తలలపైన జ్యోతూలెత్తుకోని ఆతైత తైత తైత తైతా యంటు తాళాలువేసుకుంటూ ఆడినారె యువత ఊరంత జ్యోతులు కలియతిరిగినాయె అమ్మానాన్నలు పిల్లాలతోడ జ్యోతులదర్శనాలు జేసుకోని మనసారమొక్కు కోని భోజనాలు జేసుకోని తిరిగి ఎద్దులబండిలోన ఊరుా చేరినారె ప్రతియేడుఅమ్మనాన్నలూ మొక్కూలు తీర్చుకోన చౌడమ్మజ్యోతులాకు వెళ్లినారే (పెన్నా నది పరీవాహకప్రాంత అధిదేవత.గంగాకావేరీ అనుసంధాన ప్రక్రియలో ఈఅమ్మవారు కాశీవిశాలాక్షి అనుమతి తో గంగానదిని దక్షిణ భారతావనికి తరలిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసము.ఈమె అగ్ని దేవత,క్షామ దేవత, జలదేవత గా నమ్మి ఇక్కడిప్రజ పూజిస్తారు.ఒకవూరి ఆడపడచు భర్తపిల్ల లతో పుట్టింటి వూరిలో జరిగే గ్రామదేవత చౌడేశ్వరి జ్యోతి మహోత్సవాలకు బయలు దేరిన సన్నివేశం ఒక దీర్ఘ కవితగా ఇక్కడఅందించడమైనది) పె.ల.స్వా ~~~~~~
మాపల్లెలో సంక్రాంతి కోడిపందాలు
పశుపక్షాదులతో సహజీవనం ఈదేశ జనపదుల సంప్రదాయం ఆవులు ,గేదెలు ,వృషభాలు,గుర్రాలు, మేకలు,ఒంటెలు ,కుక్కలు, గాడుదలు ఇలానాల్గుకాళ్ళ సాధు జీవులు కోళ్ళు, నెమళ్ళు ,పావురాలు, బాతుల్లాంటి రెండు కాళ్ళపక్షులు మనతో కాపురంజేయ గుడిసెపైరాత్రి కునికి మూడోజామున్నే కోడిపుంజు కొక్కరకోయంటూ కూతేసింది రాత్రి బౌబౌమంటు ఊరుకాశిన గ్రామసింహాలు అప్పుడప్పుడే అరుపులు మాని పడకేశాయి గోమాత అంబాయంది- వృషభం రంకేసింది గాధ్రభాలు ఓండ్ర పెట్టాయి- గుర్రాలు సకిలించాయి ఇవి నిత్యం మనూల్లో మనంవినే సాధు జంతువుల యరుపులు గుడిగోపురంపై దినకరా యంటు మైకు లో పాట ఉదయాన్నే వినపడ కొండెనుక సూరీడు రథారూఢుడై కాషాయకాంతితో తూర్పు కొండెక్క నిద్రించిన లోకం మేల్కొంది వచ్చే పుష్యమాసం సంక్రాంతి పండక్కి చిత్రావతి ఒడ్డున మావూళ్ళ ల్లో కోడిపందేలు జోరుగాసాగేను ప్రతిఏడు మావుారి సత్తెకాలపు ముసలి రంగయ్య కోడిపందాలంటే చెవికోసుకొనేను ఆయింటి ఈయింటి వయసుమల్లిన ముసలోళ్లు పక్కూరి వారంసంతకెల్లి బెడసకోడిపుంజుల్ని వెదకిఏరికోరి ఐదేళ్ళకు పదునైన గోర్లున్న కోళ్ళను అధికధరచెల్లించి కొనితెచ్చి పెరట్లో చెట్టునీడనగుంజకు కట్టి మేపడం మొదలెట్టేరు రోజుఉదయాన్నె పెద్దాయన రంగయ్య చిట్టెడు జొన్నగింజలు మట్టికుండలోనానబెట్టి సాయంత్రంయింటి గోడకింద గొంతుకూచొని కోడికాళ్ళుకట్టేసిమోకాలికొంకిట్లో ఇరికించుకొని నానబెట్టిన జొన్నగింజల్ని చాట్లోపోసుకొని పిడికెడు నిండ తీసుకొని కోడి నోట్లో గింజెల్నిపోసి కుక్కికుక్కి తినిపించి దానిమెడతీడుతూనీరుతాపి జారమింగిస్తూ పొట్టనొక్కిచూచినిండిందనితెలిసొచ్చినంత వదిలేయ అది రెక్కలిదిలించి పొగరున పదేపదే కూతలేస్తుండె ఒకరోజు వీధి దిబ్బల్లో క్రిమికీటకాలు ఏరుకు తింటున్న ఊరికోడిపుంజులపై రంగయ్య పిక్క కండలు బలిసిన తనకోడిని సంధించి ఎదురుకోళ్ళపై వదల తనకోడి పదేపదే ఎగిసి వాడియైన కాలిగోళ్ళతో వాటిని కుమ్మేసి గాయపరచ రక్తంచిట్లి పరులకోడి పలాయనం చిత్తగించ సత్తయ్య సంతసించి తనకోడిని పట్టుకొని బుజ్జగించి బుజ్జిదంటూ ముద్దాడి గుంజకుకట్టి సంక్రాంతిరాకకై ఎదురుచూసె రాబోయే సంక్రాంతికి కోళ్ళపందెంలో తనకోడి గెలవాలని సత్తెయ్య సానరాయిపై వజ్రాయుధం లాంటి కత్తుల సానబట్టి నూలు సంచిలో నొక్కొక్కటి వరుసన చుట్టివుంచి పందేనికి సిద్ధం జేసి భద్రపరచె పండుగరోజున మాఊరి పురమ్మాను రచ్చబండ అరుగుక్కాడ మిట్టమధ్యానం కోడిపందేలు జరుగేననితెలిసి పక్కూర్ల పందెందార్లు కోడిపుంజుల జోలెల్లో యాలేసి భూజానికి తగిలించుకొని వచ్చి చెట్ల నీడల్లో సిద్ధంగనుండ భారీపందేలు తిలకించ ఊరుఊరేకదిలొచ్చినిల్చె మొదటివిడత పందెంలో ఇరువైపువాళ్ళు వాడికోడికత్తులసంచినుండితీసి కోడికుడి కాలికి పైనున్న బొటన వేలికి గట్టిగబిగించికట్టిఎదురొచ్చి కోళ్ళ ముక్కులతో నొకదాని నెత్తిమీది ఎర్రజుట్టును మరొకదానితో కొరికించి పౌరుషంపెంచి ఇరుప్రక్కల వారు దూరంజరిగి నేలన వదల రెండూ కోళ్ళు మెల్లమెల్లగ ముందుకునడిచొచ్చి కాలిబిగువునఎగిరెగిరి తన్నుకొని రెక్కలకింద గాయమై రక్తముచిట్లి మాఊరికోడి గిలగిల తన్నుకొని నేలకరుచుకొని కూలపడి ఓడిపోయె గెలుపోటములపై పందెమాడినవారిలో డబ్బుల కట్టలు స్వర్ణాభరణాలు చేతులుమారె మావూరి రంగయ్య పౌరుషాన తనకోడికి వజ్రాయుధంలాంటి వంకరటింకర కత్తిని బొటనవేలికి కట్టి కోడికి నీరుతాపి దప్పిక తీర్చి రణరంగంలోకి దించ వీక్షకులు కేకలేయ రెండుకోళ్ళుకలవడి ఆకాశానికెగరుతూ పదేపదేతన్నుకొని అలసటపడ యజమానులు వాటినిపట్టి మరోసారినీరుతాపి చెవులలో గాలివూది వాటిని ఉషారుపరిచి మరిమరివదల రెండు పౌరుషాన అతివేగాన కలబడి పోరాడుచుండ చూడొచ్చినజనాలు ఈలలుకేకలువేస్తూరెచ్చిపోయిఅరుస్తూ పదులు వందల రూపాయలు పందేలు కడుతుండ మావూరి రంగయ్యకోడి ఎదురుకోడి రెక్కలకింద డొక్క కడుపున వీరత్వమున కత్తిగుచ్చి కిందపడేయ రంగయ్య మీసాలుమెలేసి కేకలేసి తనకోడిని ఎదుటికోడిపై పదేపదేవదల రెండుతన్నుకొంటూ వెనుకకు ముందుకువచ్చి కదంతొక్క రంగయ్య కోడిగెలుపొంద అవధులులేని ఆనందాన తనకోడిన ముద్దాడ ఓడిన కోడినెత్తుకెళ్ళి ఇంటిల్లిపాదితో సంతోషాన కర్రీపండుగజేసికొనె.... చిత్రావతొడ్డు మాపల్లెల్లో సంక్రాంతికి కోడిపందేలు ఇలాసరదాగ నాడుసాగుచుండ నేడు కోడిపందేలు గ్రామకచ్చలకు నెలవుకాగ ప్రభుత్వాలు పల్లెల మేలుకోరి కోడిపందేలాటలను నిషేధించి గ్రామకచ్చెలు నివారించె నేడన్నిచోట్ల....... ~~~~~
శ్రీశుభకృతుకు వీడ్కోలు - 17
సూర్యుడు శశిర హేమంతాల చలికి మేఘాల దుప్పటికప్పి ముసుగేయ రతసప్తమికి రవి లో వేడితీక్షణత పెరిగె బహుళ చతుర్ధశికి చంద్రడు నెలవంకగదోచె శుభకృతుబహుళ అమావాశ్య కు మల్లెల వెన్నెలవీడి చీకట్ల మసకే య అమావాశ్య చిమ్మచీకట్లకు చంద్రుడుకనుమరుగై నక్షత్రాలు తలతలమెరియసాగె గగనాన అరుణ కిరణాలు కడలిని తాక నీలినీరు కాషాయవర్ణముదాల్చి కనువిందుజేసె కెరటాలు నెమ్మదిగ పొర్లివచ్చితీరాన్ని తాకి ప్రియముగ ముద్దాడి వెనుదిరుగుచుండె పండుటాకులు రాలి మోడుబారిన వేప చెట్లకొమ్మరెమ్మలకు కొత్త చిగుళ్ళు వేయ చిగురుటా కంచున చిరుపూల గుత్తులేయ ప్రకృతినవిషపుగాలి పోయి మధురగాలులువీచె మామిడివనాలు పూలవనాలవ్వమధురికాలు ఝంఝారనాదంతో వచ్చి మకరందముగ్రోల పూలపుప్పొడిలో సంపర్కముజరిగి పచ్చని కొమ్మలకు కాయల గుత్తులుకాసె కాయలతోబరువెక్కినకొమ్మలునేలతాక చిరు గాలికి కొమ్మలు ఇసుకనేలపై బాపు గీతలబొమ్మలుగీసె కోకిలలు లేత చిగురుటాలకులు గిల్లుకతింటు పరవశమొంది కువ్వోవ్ కువ్వోవ్ యని పాడె శ్రీశుభకృతు కు వీడ్కోలు పలుక పావురాలు జతలుగట్టి సరస సల్లాపాలకై గుడుగుడుమంటూచెట్లనీడనుజేరె పూలవనాల నీటివనరులవెంట మగనెమల్లు వేయికనుల ఈకలపురులువిప్పినాట్యమాడి శ్రీశుభకృతు కు వీడ్కోలు పలుకి చైత్రశుధ్ధపాడ్యమికి ఉషోదయాన శోభకృతుకు స్వాగతముపలుక తెలుగువారి తొలిపండుగ ఉగాది వచ్చి యింటిల్లిపాది వాకిళ్ళ కొత్తశోభ తెచ్చె... ~~~~~
గుడారాలు
కురుక్షేత్ర యుద్ధభూమిలో పౌరుషాన పగలంతాపోరాడి అలసి విశ్రాంతి కోరే యుద్ధవీరులు రాత్రి విడిది కోసం ఏర్పాటు జేసికొన్న గుడారాలు కావవి ఎడారు ల్లో ఒంటెలనెక్కి ఇసుక మేటలపైతిరిగి తిరిగి అలసి అలసి ఒయాసిస్సు లగుపడ జేరుకొని ఒంటెలకు నీరుతాపి ఖర్జూరపు చెట్ల నీడలలో నిల్పుకొని మేపుకుంటూ విశ్రాంతిగొన అరబ్బు వ్యాపారస్తులు వేసుకున్న గుడారాలు కావవి దేశసరిహద్దులలోని సైనికులు కళ్ళకు ఒత్తులు వేసుకొని దిక్సూచి అమర్చిన రైఫిళ్ళు చేతబట్టి శత్రువుకు అగుపించకుండ గురిపెట్టి నిల్చొని బంకర్లపై కప్పుకున్న గుడారాలు కావవి శుభకార్యాలు ఎక్కడ జరిగినా అతిథులు తిని పారవేసిన ఎంగిలి విస్తరాకుల మెతుకులు ఏరుకుతినే సంచార జీవులు రైలుపట్టాలెంబడి వేసుకున్న గుడారాలూ కావి పట్టణ రాజమార్గాల వెంబడి పౌరుల ఆయురారోగ్యాల కాపాడ సంచారవైద్యశాలలు నెలకొల్పుకొని మూలికా వైద్యమందులు అమ్ముకొనే సంచార వైద్యులు వేసుకున్న గుడారాలూ కానేకావవి మరెవరివా గుడారాలు? ఎంతో కష్టపడి పై చదువులు చదివి మరెంతో కష్టపడి ఉద్యోగం సంపాదించి భార్యాబిడ్డలను వెంటనిడుకొని ఊరు గాని ఊరులోని అడవుల్లోనో లేక ఊరి బయట బీడు భూముల్లోనో మకాము జేసి ఉదయాన్నే నిద్రలేచి సుత్తి, కంపాస్,పెన్సిల్, నోటు పుస్తకంగల కాన్వాస్ సంచిని భుజాన తగిలేసుకొని నెత్తిన టోపీ ధరించి నీటి సీసా చేత పట్టుకొని ఎండనక వాననక గాలి దుమ్ము ధూళిలో వంచిన తల ఎత్తకుండా తిరుగాడుతూ ప్రతిదినం భూగర్భ ఖనిజాల అన్వేషణ నిర్వహిం చే భూగర్భశాస్త్రవేత్తలేసుకున్న గుడారాలే గాని మరి ఏ ఇతర సంచార జాతుల వారు వేసుకున్న గుడారాలు కానేకావు...... ~~~~~
నువ్వులేని నాజీవితం ఎడారి జీవనమే
ఈనిరంతర జీవన ప్రయాణంలో కొందరికి గమ్యం మరికొందరికి అగమ్యం కొత్త పరిచయాలు పాతవిడిపోవడాలు ఎటూపాలుపోని ఏకాకి జీవితంలో నీతోపరిచయం నాకోవరమై స్నేహంగామారి చెట్టునీడన ఏకాంత ప్రదేశంలో ఇద్దరం పలుమార్లు మాట్లాడుకోవ ఒకరికొకరి మనోభావాలు అర్థమై నీపై నాకు ప్రేమపుట్టుకొచ్చె నాప్రేమనీకెలా వ్యక్తంచేయ తెలియక నామనసు కలవరపడుతుంటది ఎన్నో నిదురలేని రాత్రులు గడుస్తున్నవి నిదురించిన క్షణాలు నీ రూపలావన్యం నాకనుదోయిల్లో మెదలి నీప్రతిబింబం నామనోనేత్రాల్లో స్థిరముగ నిల్చింటది నిన్ను మరువజాలక నాగుండె సుడిగాలిలా బిస బిస శబ్దంచేస్తుంటది ఏకాంత కలయికకు నువ్వస్తుంటే నీ కాలి అందియల మృదుమధుర శబ్దాలు ఆ చిరుమువ్వల సవ్వడులు ఆ అందెల రవళులు నా మనస్సును తాకి ప్రతిధ్వనిస్తూ సందడి చేస్తుంటాయి నీవునేను జతగా కలిసి మాట్లాడు తుంటే కొలను నీటిలో తామరాకుల నడుమ హంసలు దరిజేరి పలకరించు కున్నట్లుంటది ఎందుకో కొంతకాలంగ మనమధ్య తెలియని ఎడబాటు నన్నుకలవర బెడుతున్నది నువ్వులేని నాజీవితం ఎడారిజీవనమేకదా .... ~~~~~~
మాకు మించిన స్వతంత్రజీవులు ఈ ప్రకృతిన లేరంటూ
చిత్రావతి నదిపక్క మాపల్లెటూరు పల్లెపక్కనుంటాయి కొండకోనలు ఆకొండకోనల్లో చిట్టడవి పొదలు ఆపొదల్లోన నుండు పక్షులకుగూళ్ళు ఆగూళ్ళలో నక్కి దాగుండు కముజు పిట్టల జంటలు రాత్రిపరుండిన జంటపిట్టలురెండు పెందలాడె నిదుర లేచెేను నిదురలేచిన పిట్టలు బయటికొచ్చేను బయటకురావంగానె రెక్కలుచాచి నిదురలో పట్టేసినఒళ్ళువిరిచి విదలించి ప్రకృతిలో సుార్యుని వెలుగుజూచి ఆహ్లాదాన రివ్వున గగనాని కెగిసి దారెంట చిత్రావతినది ఇసుక మేటలపైదిగి ఏటికాల్వకు నడిచెల్లి చల్లని నీరుతాగి ఎగిరి సుదూరం తూర్పు దిశ పయనించి ఆకలిగొన్న పిట్టలు కోతకుగురైన కందిపంట ఎర్రచేనును గాంచి రివ్వున నేలనువాలి కలియదిరిగి తోటిజాతి పక్షులతో కలిసి కనికరాళ్ళ సందుల్లో రాలిన కంది గింజలొక్కొక్కటి ఏరుక తింటూ మిట్టమధ్యానాన ఎండవేడిమి అధిక మవ్వ పొట్టనిండ ఆయాసమొచ్చి చేనుగట్టు చింతచెట్టు నీడనుచేరి కముజు పిట్టలు జతలుకట్టి సరస సల్లాపాలాడి ఒదిగికూర్చుండి భానుడు పడమటి కొండకువాల పొద్దుగూకునంచు గూటిచేరె వేళాయంటు తోటి పక్షులకు మల్లీకలుస్తమంటూ పదేపదే కౌగిలింతలతో వీడ్కోలుపల్కి రెక్కలూపుతూ పైకెగరి ఆకాశమార్గాన ఎదురుగాలికి ప్రయాణము సాగక గాలిలో పైకికిందికి ఉగుతూ దూకుతూ పయనించ దారిమధ్యలో అలసటొచ్చి చిత్రావతి ఏటొడ్డుకాలువ ఇసుకమేటలపై వాలి కాళ్ళురెక్కలాడిస్తూ ఇసుక తోడ గుంతలవ్వ చల్లని ఇసుక గుంతల్లో క్షణకాలం కూర్చుండి కునికి అలసటతీర తదుపరిప్రయాణించ లేచి కాలువలో పారే తేటచల్ల నీరు తాగి తిరిగి ఎగిరి ప్రయాణం సాగించి అడవిజేరి గూటిముందు చెట్టుపొదకు దూరాన నెమ్మదిగా వాలి ముందుకునడిచి పాములాంటి శత్రువులున్నాయేమోనని అనుమానించి అటుఇటు పరికించి చూచి ఎవరులేరని నిర్ధారించుకొని భీతివీడి గూటినజొచ్చినేటిరోజు జీవనం హాయిగ గడిచెనంచు నిదురించె జంట కాలంగడిచి ఆడపక్షి గర్భముదాల్చి గుడ్లుపెట్టి పొదిగి పిల్లలు లేప దినవారి నోటినగింజలేరి తెచ్చి కీటకపురుగుల వేటాడిపట్టీ తెచ్చి రుచుకరభోజనాలు పిల్లలకుతినిపించ కాలంగడిచి పిల్లలు ఎదిగి రెక్కలొచ్చి పెద్దవై గూటిబయటికొచ్చి సుందరప్రకృతి గాంచి గూడువిడిచి గాలిన ఎగిరిపోయె ఇలా తరతరాలుగ కముజుపిట్టజంటపక్షులు జీవనం సాగించు చుండె కలకాలం మాఊరి చిట్టడవిలోన మాకుమించిన స్వతంత్రజీవులు ఈప్రకృతిన లేరంటూ సంతసాన పదేపదే కికికికోయ్ కికికికోయ్ యంటూ యదాతథంగ వీనుల విందుగ పాటలుపాడుతూ వినిపించ వినిఆనందించు చున్నారు చిత్రావతి నదిగట్టు పల్లె జనులు నాటినుండి నేటివరకు....
ఉగాది వచ్చి యింటిల్లిపాది కొత్తశోభ తెచ్చె
ప్లవనామసంవత్సర శుద్ధపౌర్ణమికి పూర్ణచంద్రుడు మల్లెలవెన్నెలవాన కురిసె ప్రతిరోజు సూర్యుడు శశిర హేమంతాల చలికి మేఘాల దుప్పటికప్పి ముసుగేసె రతసప్తమికి రవి కిరణాల్లో వేడితీక్షణత పెరిగె బహుళ చతుర్ధశికి చంద్రడు నెలవంకగ దోచె అమావాశ్య చిమ్మచీకట్లకు కనుమరుగై నక్షత్రాలు తలతలమెరియ సాగె గగనాన అరుణ కిరణాలు కడలిని తాక నీలినీరు కాషాయవర్ణముదాల్చి కనువిందుజేసె కెరటాలు నెమ్మదిగ పొర్లివచ్చి తీరాన్ని తాకి ప్రియముగ చెలియలికట్టను ముద్దాడి వెనుదిరుగుచుండె పండుటాకులు రాలి మోడుబారిన చెట్లకొమ్మరెమ్మలకు కొత్త చిగుళ్ళు వేసె వేప చెట్టుకు చిరుపూల గుత్తులేసి ప్రకృతిన విషపు గాలుల తరిమి మధురగాలులు వీచె మామిడివనాలు పూలవనాలవ్వ మధురికాలు ఝంఝారనాదంతో వచ్చి తనివితీర మకరందముగ్రోలె పూలపుప్పొడిలో సంపర్కము జరిగి చిగురుటాకుల కొమ్మలకు పచ్చని కాయలు గుత్తులు గుత్తులుగా కాసె కాయలతో బరువెక్కిన కొమ్మలు నేలకొరి గి ఎర్రని ఇసుకనేలపై గీతలబొమ్మలుగీసె కోకిలలు లేత చిగురుటాలకులు గిల్లుకతింటు ఆనందాన కువ్వోవ్ కువ్వోవ్ యంటు కొమ్మకొమ్మకు ఎగిరి యింపుగా పాడెసాగె ఎండలుముదర జతలుగట్టిన బెల్లగాళ్లు సరస సల్లాపాలకై గుడుగుడుమంటూ చెట్లనీడనుజేరి ముద్దాడుచుండె పూలవనాల నీటి వనరులవెంట మగనెమలి వేయికనుల ఈకల పురులువిప్పి నాట్యమాడె శ్రీశుభకృతు చైత్రశుధ్ధపాడ్యమికి తెలుగువారి తొలిపండుగ ఉగాది వచ్చి యింటిల్లిపాది కొత్తశోభ తెచ్చె... ~~~~~~
నేలకూలిన నేరేడు వృక్షరాజము
రెండుశతాబ్దాలకు పూర్వము మావూరి చిత్రావతి నదికివరదలువచ్చెి ఎక్కడినుంచొ నేరేడుమొక్కఒకటి కూకటివ్రేళ్ళతో నదీప్రవాహంలో కొట్టుకువచ్చె అదినది ఒడ్డున కొండగుట్ట అంచుననిల్చి భూమిలో ధృడంగ పాతుకుపోయె క్రమంగ అది పెరిగిపెద్దదై ఏడుబలిష్ఠమైన కొమ్మల వటవృక్షమై విరాజిల్లె అది కిరీటముపై నెమలిపింఛమువలె దోచె మాఊరికి కనువిందుగ దోచుచుండె చెట్టునీడ సుదూరము వ్యాపించుచుండె ఆచెట్టుపూత సువాసన వెదజల్లుచుండ గుత్తులుగా కాసిన నల్లని నేరెడుపూసలు , దానిబుగ్గపండ్లు మిక్కిలి తీయనైనందున రకరకాల పక్షులకు,వానరములకు ఆనవాలమై ఆకలి తీర్చుచుండె విషసర్పములకు స్థావరమైనిల్చె చెట్టునీడ పాదచారులకు ఆహ్లాదభరితముగ నుండి నిలువ నీడలేని సంచారజాతులవారికి ఆశ్రయముగ నుండె పండుగదినాలలో పెల్లీడుపిల్ల లు ఎత్తైన చెట్టుకొమ్మలకు ఊయలలువేసి ఆనందకేళితో జానపదులుపాడుతుా ఆకాశాన్ని తాకినట్లు వూగుతుంటె అదిచూచి దారినవెల్లె బాటసారులు ముక్కున వేళేసుకొని అబ్బురపడుచుండిరి ఇంతలో కాలప్రభావమేమో గాని అసూయపరులైన కొందరు పరులనాశనంకోరి వారి పై దుష్టబుద్దితో క్షుద్రవిద్యలుప్రయోగింప ఒకచిక్కటి చీకటిరోజున చెట్టుమొదలులోని తొర్రలో నిప్పురవ్వనురగిల్చి పారిపోవ ఆనిప్పురవ్వ మండుతూ వేగంగ లోలోపల తొర్రలో పైకిప్రాకి అన్నికొమ్మలకు వ్యాపించె వడ్రంగిపిట్టలు తొలిచిన చెట్టు బెరడురంధ్రాల నుండి అగ్నికీలకలు బయటికిచిమ్మి రాత్రులందు ఆకాశాన దివిటిీల వెలుగులై దోచుచుండ అదిచూచిన సుదూర పల్లెజనులు కొరివిదయ్యాలేమోనని భయకంపితులయిరి చెట్టునుఆశ్రయించివున్న పక్షులు విషసర్పాలు కొండముచ్చుకోతులు దిక్కుదోచక రోదనచేస్తు దిక్కునకొకటిగ చెట్టువీడి పలాయనం చిత్తగించె మంటలకు మండిిమండి పట్టుగోల్పోయిన చెట్టుకొమ్మలు ఒక్కొక్కటిగ కిర్రుకిర్రుమని భయంకర శబ్దముచేస్తు విరిగి నేలగూలుచుండె ఇది ఏడురాత్రుల్లుగ జరిగె అదిచూడవచ్చిన వురిజనులు ఏడ్చిఏడ్చి ఇట్టిదుశ్చర్యకు కారకులైనవారిని పరుషపదజాలముతో దూషిస్తూ గొప్పదైన ఆనేరేడువృక్షరాజమును గూర్చి కథలుకథలుగా చెప్పుకుంటు నేలగూలిన ఆనేరేడు వృక్షరాజమును చూచి మిక్కిలి వగచివగచి నిట్టూర్పువిడిచి వెనుదిరిగిపోవుచుండిరి చేయునదిలేక.... ~~~~~~~
నీతోనే నేను నీ నీడనై
నీతోచెలిమిచేయాలంటే నాకెంతోయిష్టం నీతోపాటుగ నీవెంటేవుండి నీవునడిస్తే నడవాలని కూచుంటే కూచోవాలని పరుగిడితే పరుగిడాలని అడితే ఆడుకోవాలని వుంటుంది నాకు ప్రతిరోజు నీవు గుమ్మముదాటి బయటిికివస్తే నీపనిలో సాయపడదామనే కోరిక వుంటుంది నాకు నీవు ఉదయాన్నే ఈత పొరక చేతబట్టి యింటి ముంగిట పాచికసువు చిమ్మి గంగాళం నిండుగ ఆవుపేడ కల్లాపి పదెపదే పిసికి కలిపి ఒకపక్క మట్టిముంత చేతపట్టినింపి మరోచేత కల్లాపిని నేలపై జిమ్ముతూ చీపురుకట్టనాడిస్తూ అలుకుతుంటే నీచేతిగాజుల గళగళశబ్దాలకు నేమురిసిపోతూ నీచేతులతో నాచేతులు గలిపి సాయపడాలనివుంటుందినాకు పట్టుపరికిని పైటచెంగు సర్దుకొని నడుమున బిగించి నేలకువంగి మోకాళ్ళపై కూచొని మెరిసే రంగుల ముగ్గుపొడిచిప్ప నొకచేత పట్టు కొని మరోచేత సప్త ఋషుల ముత్తామంచంలా చుక్కల వరుసలు లెక్కగట్టి పెట్టుకుంటుా వాటిచుట్టూ వంకరటింకర గీతలు గీస్తూ కలుపుకుంటూ పోతుంటే అందమైన ఆరంగవల్లులతో ఆరుబయలంతా ముస్తాబవుతుంటే నీకంటిచూపులో నాకంటిచూపు కలిపి నీవుగీసిన ముగ్గుటందాలను పదేపదేచుాడాలని వుంటుందినాకు పాచిమొగము కడుక్కొని చెంప వెంట్రుకలు దువ్వుకొని పిన్నీసులు పదేపదే గుచ్చుకొని అద్దంలో జూచుకుంటుా మురిిసిపోతూ నుదుట ఎర్రనికుంకుమ బొట్టుదిద్దుకొని జడకు మల్లెమొగ్గల సరము గుచ్చుకొని మట్టికడవ చంకన బెట్టుకొని వడివడి వయ్యారపు నడకలతో తోటి వనితలతో కలిసి ఏటిసాలుకి నీవెళ్తుంటే నీతోపాటుగ నీవెనకాలే రావాలని వుంటుందినాకు నదిగట్టున నిలబడి పైటకొంగు సర్దుకొని అద్దంలాంటి నీటితెరపై చంద్రబింబము వంటి నీ ముఖ ప్రతిబింబం జూసుకుంటు నీ అందాలకు నీవే మురిసి పోతుంటే నీఅందమే నా అందమనుకొని నేనుామురిసి పోవాలను కుంటుంటా లోతైన ఏటినీటిి జాలలోకి మెల్లగదిగి మట్టికడవ నీటముంచ గుడు గుడుశబ్దంతో నీళ్ళునిండ నిండుకడవను పైకెత్తబోయి నీవుచతికిల పడబోతా వేమోన ని నారెండు చేతుల ఆకడవను పైకెత్తి సాయపడి నీచంకన వుంచుదామని మదినతలచి నీతో నేనుండిపోవాలని వుంటుందినాకు నీవయ్యారపు నడుమును అటుయిటు తిప్పుతుండ ఇసుకదిన్నెల వంటి పిరుదులు కదులుతుండ నిండుకడవ బరువు భారంతో నవనీతంలాంటి మృదుమెత్తని ఇసుక మేటలలో అడుగులోఅడుగువేసుకుంటూ బిత్తరచూపులు జూస్తూ మెల్లగనడుస్తూ నీవెలుతుంటే కాలిపట్టీల చిరుమువ్వలు వినసొంపుగ సవ్వడిజేస్తుంటే నీతోపాటుగ నేనూ నడుస్తుా నీకాలిగజ్జల సవ్వడిని ప్రతిరోజు చెవులార వినాలని వుంటుందినాకు మల్లెపుాలుగుచ్చిన నీనల్లటి కురుల వాలు జడకుచ్చులు మృదుమెత్తని పిదురులపై మృదంగ శబ్దంతో నాట్యమాడ నీకదలిక నన్వయించి నీవెనకాలే నడవాలని వుంటుందినాకు ఇంటిగడపదాటి యింటిలోకి నీవెలితె నీవు తిరిగివచ్చేదాక ఎదురుజూస్తూ ఇంటిగుమ్మాన నిలబడిపోతిని నేను ఎల్లప్పుడు నీతోనే నేను నీనీడనై నిన్నువెన్నంటివుండాలనే కోరికవుంటుందినాకు కడదాకన నీచెలిమికోరి..
చైత్రమాసపుకోయిల
శర కాలపు చంద్రుని వెన్నెల అడవియంత విరగబూసినా దట్టమైన వృక్ష సముదాయం వెన్నెల నేలతాకనీయక యడ్డుపడె వెన్నెలలేని యడవి చిన్నబోయి హేమంత శశిరాలలో చెట్ల ఆకులు పండుబారి శీతల గాలులు వీచి నేలరాల మోడుబారిన చెట్లతో వనదేవత బోసిపోయె చెట్ల నీడలేక పండ్లు కాయలు లేక అహారకొరతతో ఆశ్రయము లేక పక్షిజంతువులు పలుప్రాంతాలకు వలసలెల్లె చైత్రమొచ్చి చెట్లకొమ్మల చిగురులు మొదలాయె యడవీడెల్లిన కోయిలకు కొత్తప్రాంత అహార యలవాట్లకు గొంతు బొంగురోయి తన మృదుమధుర గాత్రాన్ని సవరించుకోవ కొమ్మకొమ్మెనెగిరి చిగురాకులచిగుళ్ళ గిల్లిగిల్లి తిన చిగురాకుల లేతరసానికి గాత్రము సర్దుకోవ చైత్రమాసపు కోయిలై తియతీయగ పాటలుపాడ అంతదనుక చెట్లకొమ్మలపై గంతులేస్తూ పండ్లుతినే నామాల చిలిపి ఉడుత తాను తినటంమాని పాటవినుట కుపక్రమించే పక్షిగూళ్ళలోని చిరుపక్షుల వేటాడమానె సర్పాలు చెట్లకింద ఎలుగుబంట్లు నిల్చుండిపోయె ఘీంకరంచె ఏనుగులు కదలక మెడలకనుండె జింకలు,లేళ్ళు,దుప్పులు సరసాలుమానె చైత్రమాసపు కోయిలపాటకు కొలనులో వికసించిన కలువపూల నడుమ రాజహంసలు తామరాకులపై నాట్యమాడె సెలయేరులు సంగీత విభావరులు వినిపించె చైత్రమాసపు కోయిల మృదుమధురగానానికి ప్రకృతి ఎల్లెడల పరవశ మొందె.......
తూర్పువెళ్లే రైలు)--08 (ఆంధ్రకాశ్మీరము అరకులోయ) 2వ. భాగము(దీర్ఘ కవిత)
విశాఖ-అరకు రైలు దారివెంబడి ప్రకృతి దృశ్యాల వీక్షణములో మునిగితేలుతున్న ప్రయాణికులు అరకు స్టేషన్లో రైలాగిపోవడంతో ఒకింతతేరుకొని వడివడిగ సామాన్లు సర్దుకొని కేరింతలతో క్రిందికిదిగుతూ అరకులోయ సుందర దృశ్యాల తిలకించే కుతూహలంతో వడివడిగా కెమరాలు,బైనాకులర్స్, సెల్ఫోన్సు చేతబట్టి ఒకరి వెంట ఒకరు బారులుదీరి కడు ఉత్సాహాన ముందుకు నడిచిరి అలావస్తున్న యాత్రిక విహారీలకు పచ్చగడ్డి తివాచి మైదానాలలో పసుపు రంగు గడ్డిపూలు సాదర స్వాగతములు పలుకుచుండె అప్పుడప్పుడు వీచే చిరుగాలులకు పంటపొలాలు అలలువూగి విహారికులవల్లు పులకింపజేస్తున్నాయి లోయలవెంట నేలనుకప్పిన మేలురంగుల ముద్దమందారాలు, బంతిపూలు,చామంతులు ,సంపంగెలు, సెంటుజాజులు,గుండుమల్లెలు, లిల్లిపూలు,కాదంబరిీలు,నిత్యమల్లెలు, దవనము ,మరవము ,కాగడాలు , పలురంగుల మేలుజాతి గులాబీలు, కొలనుగట్టున మిన్నాగులకు మత్తునిచ్చే మొగలిపూల సువాసనలు పూదోటల సముదాయాల తిలకింప మనుజుల మనసుకు రెండుకళ్ళుచాలవాయ కాఫీ ,తేయాకు , కాయగూరల తోటలు నోరూరించే ఆపిల్ ,గోడంబి ,ద్రాక్ష ,మామిడీలతోటలు టెంకాయ, ఖర్జూరపు వనాల సమదాయాలు ఆ వచ్చిన అతిథుల మనసులు ఆహ్లాదపరుస్తుంటే అన్ని వినోద భరిత దృశ్యా లను వదలకుండా చూడాలనే యాత్రతతో పిల్లల చేతులు గట్టిగ పట్టుకొని వడివడిగా ప్రకృతిలోనడుస్తున్నారు పూల సుగంధ పరిమలాలకు ఆకర్షితమైన మధురికములు , తూనీగలు ,సీతాకోకచిలుకలు పూలమకరందాన్ని గ్రోలిన మత్తులో మగతగా గాలిలో ఊయలలూగ బంగరు జీరంగుల జుంజూరనాదాలు మధురశబ్దాలై వినిపించె గోరెంకలు, పలు రంగులరామచిలుకలు, పావురాలు నెమల్లు, కముజుపిట్టలు, అడవికోళ్ళు ,నీటికోళ్ళు, తెల్లకొంగలు ,చెరువుకోళ్ళు ,తుర్రుపిట్టలు, కొప్పుగువ్వలు,గిజిగాళ్ళు ,బెళ్ళగాళ్ళు , ఊరిపిచుక లు, చెరుకుపిచుకలు,బెగ్గురుపక్షులు, వంటి చిన్న పెద్దపక్షుల కిలకిలారావ శబ్దాలు చేస్తూ భీతివీడి మచ్చికతో పలుపావురాలు,చిలుకలు, యాత్రికుల భుజాలపై వాల వారి ఆనందానికి అవధులులేవు కుందేల్లు, లేళ్లు ,జింకలు ,దుప్పుల పరుగులు నల్లని మేఘాల కదలికలు ఉరుములు మెరుపుల చల్ల గాలుల చిరుజల్లులు వీచ చూపరుల మంత్రముగ్దులను జేస్తున్నవి మినుగుడు పురుగుల తలుక్కులు, కీచురాళ్ళ కీచురుశబ్దాలు, క్రిమికీటకాదుల కదలికలు, జలపుష్పాల వయ్యారపు కదలికలు, పడగలుపైకెత్తి భుసకొట్టే విషనాగుల శబ్దాలు ఇంకెన్నో సరీనృపాల కదలికలు అబ్బురపరుస్తున్నాయి చిరుగాలికి మెల్లగ కదిలే చెట్లకొమ్మలనీడన అరకులోయ ప్రకృతి అందచందాలు వీక్షించరెండుకళ్ళు చాలవని మయూరాలు విప్పారిన ఈకలలో పొదిగిన వేయికళ్ళతో ఆనందపరవశమున నాట్యమాడుతూ తిలకిస్తూ విహరిస్తున్నవి చిలుకాగోరెంకలు ప్రేమసల్లాపాలలోమునిగియుండ కువుకువ్వో మనే కోయిలపిలుపులు కికుకికోమంటూపిలిచే కముజుపిట్టలకూతలు ప్రేమపావురాల గుడుగుడువిన్యాసాలు బెల్లగాల్ల గుహ్ గుహ్ శబ్దాలు గుద్లగూబల ఉహ్ ఉహ్ మనే కావుకావుమంటున్నకాకులు పచ్చని పంటపొలాలు పూలవాసన గుబాలింపులు చెట్ల చేమల చిట్డడవులు ఆకాశాన ఎగిరేపక్షుల గుంపులు కుందేల్లు, లేళ్లు ,జింకలు ,దుప్పుల పరుగులు రాత్రులందు వన్యమృగాల కదలికలు వాటి భయానక అరుపులు కొండలనడుమ దా రులు దారులవెంబడి గుడిసె నివాసాలు లంబ సింగి గిరిజన కన్యల కట్టుబొట్టు అలంకారాల అలవాట్లు నెత్తిన నీటి బిందెలతో వయ్యారపు నడకలు గిరికన్యలతో మచ్చికైన పిల్లులు, కోళ్ళు ,కుక్కలు ,బాతులు,కోతులు, మేకలు, పొట్టేల్లు ,ఆవులు, గేదెలు , వృషభాలు, గుర్రాలు, గాడిదలు, గుడిసెల్లో పసిపిల్లల ఆకలి ఏడుపులు మైదానాల్లో బాలబాలికల గ్రామీణక్రీడలు చెట్లమాటున యువతీయువకుల ప్రేమసల్లాపాలు మంచానపడిన ముసలోల్లమూలుగులు చెట్లనడుమ సూర్యకిరణాలవెలుతుర్లు వెన్నెలరాత్రులు అమావాశ్యచీకట్లు ఆకాశాన నక్షత్రాల తలుకు బెలుకులు పాలపుంతల వెన్నెలదారులు వర్ణించరాని మరింకెన్నో వింతదృశ్యాలు వీటన్నిటినీ కలిసిన అరకులోయ మంచుదుప్పటిపరచుకున్నవేళలో ప్రకృతి చలికౌగిట్లోబంధీఅయ్యింది ఉదయ సంధ్యవేళల్లోఇటువైపు చూడటానికి ఇనగణునికే వణుకుపుడుతోంది పుడమి పొగమంచు తెరల పరదాలలో ప్రకృతిఆరాధకుల చలించి పరవశింపజేస్తోంది అందాల అరకులోయ ఎంతటి సుందర నందన వనదృశ్యమైనా గిరిజన శ్రమజీవులకు కాస్త కష్టమనిపించి నా ప్రకృతి ప్రేమికులపాలిటఆంధ్రకాశ్మీరము అరకులోయ భూతలస్వర్గమే యంటూ ఆనందాతి అనుభూతిని నిండిుకున్న మనస్సులతో నిత్యం వెనుదిరుగుచుండిరి ప్రకృతిప్రేమికులు ఆవిశాఖరైలుబండెక్కి .. ~~~~~~~
తూర్పువెళ్లే రైలు--07 (ఆంధ్రకాశ్మీరము అరకులోయ) 1వ. భాగము(దీర్ఘ కవిత )
విశాఖస్టేషన్ రైలుపట్టాలపై అరకు గుండా తూరుపువెళ్ళేరైలు వేడియావిరి వదలుతూ అప్పటికే వచ్చిఆగింది అరకువెల్లే ప్రకృతిప్రేమికులు బండికదులుతుందని మూటముల్లాచేతబట్టి గబగబా రైలెక్కి సర్దుకొని కూర్చున్నారు చివరిభోగిలో నుంచి గార్డు బయటికి వచ్చితొంగిచూచి బండెక్కేవారు ప్లాటుఫార్ముపై ఎవరూలేరని నిర్ణయించుకొని విజిల్ వేసి పచ్చజెండా ఊపాడు రైలుబండి కదలబోతోందని హెచ్చరిస్తూ కూయ్ కూయ్ మంటు రైలింజను పదేపదే దీర్ఘంగ కూతవేసింది పట్థాలపై రైలు బోగీల చక్రాలు మెల్లగ ముందుకు దొర్లి వేగము పుంజుకుంది క్షణాలలో సింహాచలస్టేషన్లో రైలుఆగింది ఎక్కేవారు ఎక్కారు దిగేవారు దిగారు పండ్లు తినుబండారాలు కొనేవారు బిరబిరా కొంటున్నారు టీ ,కాఫీలు తాగేవారు తాగారు వార్త పత్రికలు కొనేవారు కొంటున్నారు రైలు ఆగింది పుణ్యస్థలం కదాయని కొందరు దానధర్మం చేదామానుకుంటే ఈ రోజుల్లోయాచకులెవరూ లేరక్కడ కనుమరుగైనారేమొ పాపం అంతలో కూతేసి కదిలింది రైలు పోతున్నది ఎత్తైన తూర్పుకనుమల గుండా పర్వత పంక్తుల రాసుకుంటూ ప్రకృతిఅందాలకు పరవశించినరైలు వేగముపుంజుకొని పరుగెడుతున్నది దారెంబడి పచ్చగడ్డి మేస్తున్న మేకలు ,గొర్రెలు, ఆవులు ,గేదెలు రైలుకూతకు చెల్లాచెదురై పక్కకు పరుగెడుతున్నాయి గూడెలలో నివసించే గిరి జనపిల్లలు తెలియని ఆనందంతో అరచేతు లూపుతూ ఆత్మీయతా నందంతో సంతోషపడుతున్నారు తూర్పు నీలి సముద్రాన్నితాకే నిలువెత్తు తూర్పుకనుమలు పచ్చలహారమై తోరణంలా కనిపిస్తే పరుగిడే రైలు సగరుని ముంగురులకు అల్లిన పొడుగైన వాలు జడలావుంటే ఎగసి పడే తెల్లని అలల నురుగు జడకు గుచ్చిన మల్లెపూల దండవోలె తోస్తున్నది కొండ కొండకు నడుమ లోయల్లో జాలువారె జలపాతాలు పాలధారలై పొంగిన పాలనురుగు నుండి వచ్చే నీటి తుంపరల మేఘాలపై సూర్యకాంతి వెలుగులుపడి పరావర్తనము చెంది ఆకాశాన సప్తవర్ణ హరివిల్లేర్పడి ప్రయానికులకు కనువిందాయే తెల్లని కొంగలు బారులు తీరి ఎగురుతుా హరివిల్లును తాకబోయె రైలుబోగీల అద్దాల కిటికీ గవాచ్చిలనుండి బయటికి చూస్తున్న ప్రయాణికులకు ఆకాశాన్ని తాకుతున్నట్లున్న పచ్చనిచెట్లు అహ్లాదపరుస్తుా నయనానందం చేస్తున్నా కొండలు ,వాటిలో సొరంగాలు , లోయలపై వంతెనలు , కొండ చెరియలు విరిగి కిందికి దొర్లిన బండరాళ్ళను దాటుకుంటూ రైలు శరవేగం పుంజుకొని కొండచరియలకు తాకినట్లున్న బుర్రాగుహలపై పరుగిడ రైలు బోగీలు డబడబ,గబగబమనిశబ్దించె ఇంతలో చేరవలసిన గమ్యం రానే వచ్చే వినోద భరిత అరకుస్టేషన్లో రైలు ఆగిపోయే... **
రైతు శ్రేయస్సే గ్రామ శ్రేయస్సు
ఒకనాటి ఆదివారం అమావాశ్యరోజు చంద్రుడు గగణాన లేనికారణాన చల్లదనము ఒకింత కొదువై తనకుతానే మండే సూర్యునికి తనదైనవేడి యధికమవ్వ ఆ ఎండాకాలం రోజు తీరని దాహం వేసింది అడిగాడు సముద్రున్ని దాహం తీర్చమని కిందికి దిగొచ్చి కావలసినంత నీరు తాగి దప్పిక తీర్చుకొని వెల్లమన్నాడు సముద్రుడు సముద్రం నుండి పుడుతూపుడుతూఒకసారి, కునుకుతూకునుకుతూ రెండోసారి నీరు తాగబోవ ఆ రుచించని ఉప్పు నీరు తాగలేకపోయాడు రవి సముధ్రునిపై కినుకవహించిన సూర్యుడు కోపావేశాన తన వేడిమితో సముద్రుని వడబోయ ఫలితం ఆకాశాన మేఘాలు వెలిశాయి అవి కాస్తభూమిపైకి బయలుదేరి సుదూరం ప్రయాణించి తిరుగుతూ యుండ రైతాంగం పొలము గట్టున నాటి పెంచుకున్న పెద్ద పెద్ద చెట్లను జూచి టక్కున మేఘాలు ఆగిపోవ ఆ నల్లటి మేఘసముదాయం నీడ చెట్లపై పడె చెట్ల ఒడలు పులకరించి కదలాడి చల్లగాలి వీచె ఆ చల్లగాలికాస్తా మేఘాలకు తాక మేఘాలు మంచు బిందువులుగా ఘణీభవించి కరిగి నీటి బిందువుల సమూహమై చెట్లను పెంచినరైతుల పొలాలల్లో ఉరుముల మెరుపులతో జోరున వానకురిసింది వాన నీరు పరుగున వాగుల్లోకి దొర్లింది , వాగులనుండి చెరువులకు చేరింది చెరువులు నిండుదనముతో తొణికిసలాడ దొర్లిన నీరు కాలువలకు చేరింది రైతుల ఆనందానికి అవధుల్లేవు మల్లించె నీరు పంట పోలాల్లోకి చాడకేసిన పొలంలో మట్టి మెత్తనవ్వ మడకేసి మట్టిదున్ని చదును చేసి పొలమంతావిత్తనం చల్ల పండిందిపంట పచ్చపచ్చగా బంగరు తీగల పొలం గట్టున ఎత్తయిన మంచె వేసి పగలు పైన నిల్చివడిసె గరగిర తిప్పి రాయి విసర పంటపై వాలి మేతవేయ వచ్చిన చిరుపక్షుల గుంపులు బెడిసి జిర్రున యెగిరిపోయే రాత్రులందు కునుకు దీయకుండ డప్పు శబ్దము పదేపదే జేయ అడవి పందులు దరిదాపులకు రాకపోయె పంటఎదిగి కంకి బరువుకు నేలకు వాలిపోవ ఒకరికొకరు సాయపడ పంట కోతకోయ రైతులందరు పుట్లకుపుట్లగ ధాన్యం యిండ్లకు చేర్చ సంక్రాతికి వండారు యింటిల్లిపాది పాయసం యింటిలో అందరు వడ్డించుకొని తినగా మిగిలిన పాయసాన్నిసంతోషంగా పంచిరి వూరిలో పదిమంది ఆకలితీర పలువురి ఆకలిదీర్చి మేలుకోరు రైతు పండిన పంటను దాచుకోడెన్నటికీ తానొక్కడే రైతు శ్రేయస్సే గ్రామ శ్రేయస్సు అదే మన దేశశ్రేయస్సు.....
🌱నీడ 🌱 సాహిత్య ప్రశంసలు
నేను రాసిన కవితలకు, సాహితీ సంస్థలకు నేనందించిన సహకారానికి ఈ క్రింది వారినుండి వివిధ సందర్బములలో లభించిన ప్రశంసాపత్రాలు , వాటిలో కొన్ని, 1) సీనియర్ సిటిజన్ వాణి మాసపత్రిక నిర్వాహకులు శ్రీపునుకొల్లుసత్యనారాయణ, మచిలీపట్నం వారి నుండి "సాహితీ బృహష్పతి" బిరుదు మరియు ప్రశంసాపత్రం., 2) అనంతపురం, తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ టీవీ రెడ్డి గారి నుండి వాట్సాప్ కవితల పోటీలో అత్యాచారాలు అణచివేతకు గురైన బాలల అంతర్జాతీయ దినోత్సవం, జీఎస్టీ పై కవిత్వం, కరోనాపై నాకవితలకు ప్రశంసాపత్రాలు., 3) సాహితీ స్రవంతి -ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం , రాష్ట్ర గౌరవాధ్యక్షులు గౌరవ శ్రీ తెలకపల్లి రవి గారి నుండి రైతుకవనంలో వినిపించిన నాకవితకు ప్రశంసాపత్రం. 4) రాజమహేంద్రవరం,గోదావరి రచయితల సంఘం( గో.ర.సం) అధ్యక్షులు శిష్టు సత్య రాజేష్, వారి నుండి మరో ఉగాది అనే అంశంపై అంతర్జాల కవితాపఠనం గావించినందులకు ప్రశాంసా పత్రం. 5) అనంతపురం జిల్లా రచయితల సంఘం(జి.ర.సం )అధ్యక్షులు శ్రీ గుత్తా హరి సర్వోత్తమ నాయుడుగారినుండి బాహుబషా కవిసమ్మేళనంలో కవిత వినిపించినందులకు ప్రశంసా పత్రం. 6) వెన్నెల సహృదయ సాహిత్యవేదిక (రి ) వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కొత్తపల్లి సురేష్ మరియు డా క్టర్ చంద్రశేఖర్ గారినుండి 'జాతిపితకు కవితాంజలి' పేరిట నిర్వహించిన కవిసమ్మేళనములో కవిత వినిపించి నదులకు ప్రశంసాపత్రం. 7) రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీముడార్ వేణు గోపాల్ గారు, ఉపాధ్యాయదినోత్సవం - కవి సమ్మేళనం లో కవిత వినిపించి నందుకు ప్రశంసాపత్రం 8) హైదరాబాదు,శ్రీ కిరణ్ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు శ్రీ లంక వెంకట సుబ్రహ్మణ్యంగారు జాతీయస్థాయిలో నిర్వహించిన కవితల పోటీలో ఒకసారి"అక్షరం " మరోసారి "నాటి పల్లెజీవనం "అనే నాకవితలు వినిపించినందులకు ప్రశంసాపత్రాలు, 9) పుట్టపర్తి నందు రాయలసీమ సాంస్కృతిక వేదిక నిర్వాహకులు నిర్వహించిన మహా కవిసమ్మేళనము లో కవిత వినిపించి నందులకుప్రశంసా పత్రం. 10) కరీంనగర్ భవాని సాహిత్య వేదిక అధ్యక్షులు డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారు అమరాగాకుడు ఘంటసాల కవితా సంకలనానికి కవిత నందించినందుకు ప్రశంసా పత్రం. 11) జెకేసి కాలేజీ, గుంటూరు నందు 11వ ఇంటర్నేషనల్ పోయెట్రీ ఫెస్టివల్ 2018 నిర్వాహకులు శ్రీ ఎస్ ఆర్ కె ప్రసాద్,డైరెక్టర్ పీజీ కోర్సెస్, గుంటూరు వారి ఆధ్వర్యములో నిర్వహించిన కవితలపోటీలో "ఆగ్రహించిన ధరిత్రి " అనే కవితను వినిపించి నందులకు ప్రశంసా పత్రం. 12) ఆంధ్రప్రదేశ్ తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షులు శ్రీ పొట్లూరు హరికృష్ణ గారి నుండి "కృష్ణా పుష్కర పురస్కారం " తో సత్కారం మరియు ప్రశంసా పత్రం . 13) అనంత సాహితీ వేదిక వ్యవస్థాపకులు శ్రీ హరిహర గారు నిర్వహించిన అంతర్జాతీయ అంతర్జాల కవిసమ్మే లేనములో పాల్గొని కవిత నందించినందులకు ప్రశంసా పత్రము. 14) Groundwater And Water Audit Department -Golden Jubilee Year(1971-2021)--SOUVENIR లో ప్రచురింపబడిన నాకవితా శీర్షిక పాఠకుల సౌకర్యార్థం కింద పొందుపరచడమైనది.
Good Messages
ఊరు పేరు గొడ్డుమర్రి
గొడ్డుమర్రి అనేది అనంతపురము జిల్లా, యల్లనూరు మండలంలో ఒక ప్రముఖ మజరా గ్రామం. ఇది చిత్రావతి నది ఒడ్డున ఉన్నందున తాగు,సాగు నీటికి కొదువలేదు. ఒకప్పుడు ఈ వూరికి పడమర దిశన ఒక జువ్వి చెట్టు మరియు దక్షిణ దిశన చిత్రావతి అవుతలి ఒడ్డున ఊడలుబారిన దట్టమైన నీడకలిగిన మరో జువ్వి చెట్టు వుండేవి. ఇవిరెండు దూరపుగ్రామాల నుండి వచ్చి పోయె పాదచారులు వాటి కింద గల ఎత్తయిన అరుగులపై తెచ్చుకున్న సద్ది తినిచిత్రావతిలో తీయని నీరు తాగి కొద్దిసేపు పరుండి విశ్రాంతిగొని తిరిగి లేచి మరల వారివారి గమ్యస్థానాలకు చేరుకొనేవారు.. ఇవిరెండు గొడుగుల ఆకారములో పెద్దగావున్నందున ఈవూరికి గొడుగులమర్రి యని పేరువచ్చిందట . తరువాత అదే కాలానుగుణంగా గొడ్డుమర్రిగా పిలువబడిందట .అవిరెండేగాక ఒక గొప్పదైనరావి చెట్టు శివాలయగుడి సమీపాన వుండేది.ఈ మహావృక్షాలన్ని కాలదోషముబట్టి కనుమరుగైన మరల వాటి సహజగుణము వలన ఊడలుభూమిని తాకి మరల పెరిగినమి. ప్రస్తుత గ్రామ జనాభా 2200 వుండి ఓటర్ల సంఖ్య1200, నివాస గృహాలు 400 గా వున్నది . ఒకప్పుడు చిత్రావతినది ఊటకాలువ ద్వారా దాదాపు 200 ఎకరాలలో వరి, రాగి, జొన్న, చెరుకు వంటి పంటలతో కళకళ లాడేది. చిత్రావతి నది రెండు కొండల వరుసల మధ్య పారు తుండడము కొండలు రకవారి చెట్లతో కప్పివుందడముతో ప్రకృతి రమననీయత సంతరించుకొని వుంటుంది. ప్రస్తుతం ఊరికి సమీపాన చిత్రావతి నదికి అడ్డముగా గొడ్డుమర్రి పేరున చిన్నపాటి నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణంతో పంటకాలువ దెబ్బతిన్నది. అయిన ఎలిభూముల్లో కొన్ని పదుల కొలది బోరుబావులు, ఏటివొడ్డున పంటపొలాల్లో ఫిల్టరు బావులు విస్తారంగా ఉన్నందున అటు వివిధరకాల పంటలకు, వందల కొలది ఎకరాల్లో ఉద్యాన వనాలైన బత్తాయి,జామ, సపోటా,నిమ్మ,టెంకాయ వంటి వాటికీ కొదువలేదు. ఒకప్పుడు బత్తాయి (చీనీ )తోటలకు ఈ గ్రామం ప్రసిద్ధి కాని ప్రస్తుత కాలంలో అరటి పంట మూడు పువ్వులు అరుకాయల్లా భాషించడముతో రైతాంగ జీవనం మెరుగ్గావుంది. ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాలతో పాటుగ ఒక రామాలయము, అభయాంజనేయ స్వామిగుడి శివాలయము,గణపతిగుడి,చౌడేశ్వరి గుడి, పెద్దమ్మ గుడి వుండి నిత్యపూజలతో భక్తబృందాన్ని సన్మార్గమున జీవింప జేస్తున్నవి. మత సామరశ్యానికి దోహదపడే విధంగా ఈ గ్రామం నడుమ ఒక దర్గా మసీదు వెలసివుండటం మొహరం పర్వదినాలలో మతవిబేధాలు మరచి అందరుకలిసి పండుగ జరుపుకోవడం విశేషమేకదా.ఈ గ్రామవాసి యైన శ్రీ తులసీధరశర్మ యనే పండిత బ్రాహ్మణుడు హిందూ దేవాలయాల నిర్వహణ బాధ్యత తీసుకొని పూజా కార్యక్రమాలు సక్రమంగా జరుపడమేగాకుండ చుట్టూత గ్రామాలలో శుభాకార్యాలకు పౌరోహిత్యం నిర్వహిస్తూ ధర్మబద్దంగా తాను జీవనం సాగిస్తూ ప్రజల కష్టసుఖాలను పర్యవేక్షిస్తూ వారికి పరిష్కరమార్గాలను తెలుపుతూ వుంటారు. ***
బామ్మ చెప్పే చందమామ కథలు
చిత్రావతి నదొడ్డుపల్లెలో రైతాంగకుటుంబాలకుతోడు చేనేతి వృత్తి కుటుంబాలుండంగ సూర్యోదయంతో నిద్దుర లేచి ప్రాతఃకాలవిధులుముగించుకొని చిత్రావతిఏటికొస్తే సందడేసందడి ఆడపడచులు వాకిలిముంగిట్లో పాచికసువులుతోసి ప్యాన్నీళ్ళేసి అలికి రంగవల్లుల ముగ్గులేసి సింగారించి పెరటి వరండాలో అద్దంముందునిల్చొని చెంపెంట్రుకలు దువ్వుకొని తిలకంబొట్టెట్టుకొని రాత్రితీసిదాచిన మల్లెపూదండ జడలోముడిచి సింగారించుకొని పైటకుచ్చండ్లు సర్దుకొని యింటివాడకానికినీళ్ళుతేవ మట్టికడవలు సంకనిడుకొని కాలియందయలు ఘల్లుమన చిత్రావతి ఇసుకతెరల నడుమపారే ఏటిపంటకాల్వకు వడివడిగావెళ్లి బుడబుడ నీళ్ళు నింపుకొని కడవ పైకెత్తి చంకనిడుకొనివస్తుండ మొగోళ్ళు ఎదురెల్లి నిండుకడవలు భుజాలుమార్చుకొని యింటికొచ్చి మట్టి బాణలు తొట్లు నీటితోనింపి కాసింత చద్దన్నమెతుకులుతినిపనులకెళ్ల పశులపిల్లగాడు కొప్పెరనెత్తెట్టుకొని గోనెసంచి చిల్లుచొక్కాతొడుక్కొని పంగలకర్ర చేతపట్టుకొని దయగలతల్లి పోసిచ్చిన అంబలితాగి సద్దికూడుమూట నీళ్ళడబ్బా చేతికివ్వ ఊళ్ళోఇంటింటి ఆలమందలతోలుకొని ఏట్లోనీళ్ళుతాపుకొని కొండడివికి తోళుకెళ్ళ ఊరిచావిట్లో రాత్రి బసచేసిన ఎరుకసానులు,బుడబుడకలవాండ్రు యామయ్యలు,జంగమదేవరలు, పగటివేషధారులు,గంగిరెద్దురోళ్ళు బయలుదేరి వీధివీధిన యింటింటికెల్లి యాచించ ఇంటిల్లిపాది చారెడు గింజెల నూకలో లేక రాత్రిమిగిలిన చద్ది అన్నము కూరలేయ తెచ్చుకొని పిల్లపాపలతో కలిసితిని ఆకలితీర్చుకొని రచ్చబండఅరుగుపై చెట్లనీడన పరుండ ఇంట్లోఅక్కచెల్లెల్లమ్మలు తమ్ముల్లముస్తాబుజేసి బడికిపంప సిద్ధముజేయ అమ్మ లోటాలతో కాఫీతెచ్చి తాపించి పప్పుబెల్లాలు చొక్కాజోబిలోపోసి పలకబలపమిచ్చి బడికిపంప వంటింట పనులకు బిడ్డలుసాయానికిరాగ ఎండినకంపకట్టెలతోపొయ్యెలిగించి అమ్మవంటపనుల కుపక్రమించ ఒకరోజు మొగోల్లలో ఒకరు నెలరోజులకు సరిపడ ఎండు కట్టెలు కొండకెల్లి ఏరుకొచ్చి ముంజేతిపొడవు తుంచి యజమానురాలు వంటకుపయోగించ వాటిలో కొన్ని పెరటి దొడ్లో పడవేయ ఇంకొకరు పశులమేత పచ్చిగడ్డికై కొండకెల్లి పైటాలపొద్దుకు తిరిగొచ్చి కాళ్ళుమొగాలు కడిగి గోడకానికూచుండ ఆలి కంచుపళ్లెములో వడ్డించుకొని తెచ్చిన ఉట్టిమీది అన్నము వట్టిచేపల మెరపతుక్కుకూరతో తిని పుల్లమజ్జిగేసుకొని ఉల్లిగడ్డ నంజుకుంటు జోరన్నముతాగి మీసాల కంటిన మెతుకులు తుండుగుడ్డతో తుడిసి చేయి కడుక్కొని కాస్సేపు కుక్కిమంచాన కూలబడి కునుకుదీసి సేదతీర్చుకొన పొద్దున కొండకెళ్ళిన పశులపిల్లోడు పశులతో తిరిగొచ్చి ఎట్నీళ్ళుతాపించి ఏయింటిపశులు ఆయింటికితోలివచ్చి వారానికోయింట్లో పెట్టినకూడుతిని పశులింటి వరండాలో పరుండి కునుకుదీసె సాయంత్రం బడినుండిపిల్లలొస్తే కంచుపళ్ళెంలోకి వేడన్నము వడ్డించి గోంగూర జోరుపప్పులోకి నెయ్యేసి మామిడూరగాయ పక్కనేసివ్వ పిల్ల లు పరుగున ఏటికితీసుకెళ్ళి ఇసుకపై తోటిపిల్లలతోకలిసి కూచొని అన్నంముద్దలు మార్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కడుపారతిని ఇసుకదిన్నెలపై ఆడిఆడి చమటపుట్ట ఏటికాలువలోని చన్నీళ్ళు ఒంటిపై జల్లుకొని కడుపారతాగి ఇంటికొచ్చిచదువుకోవడం రాసుకోవడమైపోగ అమ్మరాత్రిభోజనాలువడ్డించ అందరుకలిసి భోంచేసి డాబాలపైకెక్కి చందమామవెన్నెల్లో దూదిపరుపులపై పరుండి నూలుదుప్పట్లు కాళ్ళనుండి గొంతువరకులాగి కప్పుకొని బామ్మచెప్పే చందమామకథలు వింటూ పాలపుంతలో పరుగెడుతూ చుక్కల లెక్కిస్తూ అలసినశరీరాలు గుర్రుపెట్టి నిద్రించేను ఇట్లాయావూరివారికినిత్యజీవనమాయె.... ~~~~
క్రోధి నామ సంవత్సరం
మానవాళిఫై క్రోధాన క్రోధి కన్నెర్రజేసె భగభగామండే భానుని శరణు జొచ్చి చేతులుకలిపి యుద్ధముప్రకటించె అగ్నికీలకల వంటి ఆయుధాల నెన్నో సూర్య భగవానుడు సాయముజేయ గ్రీష్మముకంటెముందే భూమండలం పై ధ్వఝమెత్తి యుద్ధము ప్రకటించి భూమిని మరుభూమిగా మార్చనెంచె చెట్లచేమల యాకుల మాడ్చివేయ చెట్లు మోడుబారె చిరుపక్షుల నివాసములకు స్థావరములులేక దిక్కున కొకటెగిసి బతుకుజీవుడాయంటూ పారిపోయె నదీ నదములలో నీటి జాడలెండి సంద్రం చేరకపోయే జలకన్యలు సూర్యకాంతివేడిని తాలలేక ఒడ్డుకు జేరి గిలగిలా తన్నుకొని అసువులుబాసె ఇసుక తుఫానుల వేడిమి తాళలేక యడారి జీవులు యండ మావుల్లో నీటి జాడలు వెతుకసాగె సముద్రాలపై మేట వేసిన మంచుకొండలు కరిగి ముక్కలై కిందికి జార సముద్రాలు అల్లకల్లోలమై వేడిపాలు పొంగి నట్లు అలలు ఉవ్వెత్తున ఎగసి తీరాన్ని తాకి భూభాగాలను కబలించి ముంచి వేసే అధిక వేడిని భరించజాలక ధనికవర్గ జనులు ఏసీ గదులలోకూర్చుండి టివి సీరియల్సు చూస్తూ హాయిగా కాలం వెళ్ళబుచ్చిరి గాని తోటి వారికి సాయమందించలేక పోయిరి కరువులో యధికమాసమన్నట్లు దేశములో సాధారణ ఎన్నికలురాగ నాయకులు జనాన్ని ప్రొగేసుకొని మైకులెట్టుకొని ఎండవేడిమికి చెమటోడ్చి వీధివీధుల వెంబడి తిరుగలేక అలసటొచ్చి మొండిచెట్ల నీడనుజేరి చతికిల పడిపోవ ప్రభుత్వపథకాల లబ్దికై బ్యాంకులచుట్టూ తిరగలేక ముదుసల్లకు నోరెండి కుప్పకూలుచుండ చెట్లు లేకున్న భూమిపై నీ మనుగడ మృగ్యమంచు మానవాలిని జూసి క్రోధి కోపావేశమున పకపక నవ్వుకొనుచుండె.... ~~~~~~
Awards & Recognition
Trikuteswari Devi Temple
Lord Venkateshwara
Trikuteswari Devi Temple-1
Photo
Chitravati Stories
%ఇతర కవితలు % ఓ మనిషి మనుగడ సాగించ గలవా!
భూమి, ఆకాశం గాలి, నీరు, వెలుతురు అనేపంచభూతాలు ఒకదానితో ఒకటి ముడిపడి కలిసి ప్రకృతి అవుతుంది విడిపడి వికృతి అవుతుంది ఇది పరాభవ (వికారి)నామసంవత్సరం గ్రీష్మ ఋతు ఎండాకాలం సూర్యగోళం మండుతున్నది ఆకాశం నిప్పులు చెరుగుతున్నది భూమిపగుల్లిచ్చి పొగలుకక్కుతున్నది
శీర్షిక:: కొత్తనీరొచ్చిన సంబరాన....
విశాల సూన్యాకాశంలో మనిహారంలా జిగేలు మంటూ వెలుగే ను గెలాక్సీ, నె బ్యూలా నక్షత్ర సముదాయం విశ్వానికి వెలుగు నింపు సూర్యచంద్రులకు గమనానికి దారిచూపు గగనతలం సముద్ర గర్బాన ఉబికి వచ్చే అలల నీటి తుంపరలు కొండల కొండల మేఘాలై నింగికెగసి సుదూరం పయనించి వ్రేలాడు చుండు ఆకశాన చల్లగాలి సోకినంత నెలలు నిండిన గర్భవతిలా ప్రసవ వేదన పొంది తాలలేక రోధించి నట్లు
రైతునష్టపోవ శాస్త్రవేత్తవ్వు--02/19
నాటి రోజుల్లో చిత్రావతి ఏటిఒడ్డున గల గ్రామాల్లో ఆరుతడి పంట పోలాలకు నీరుతోడ ఊరికి నాల్గయిదు కపిలబావు లుండేవి కొక్కరో కోయని కోడికూత విని బావియున్న భూమి ఆసామి నిదురలేచి కాడెద్దులను తోలుకెళ్లి చిత్రావతి ఏటి కాలువలో నీరుతాపించి ఇంటిముందర నిలబెట్టి
🌱మాపల్లెలో సంక్రాంతి కోడిపందాలు - 18
పశుపక్షాదులతో సహజీవనం ఈ దేశ జనపదుల సంప్రదాయం ఆవులు గేదెలు వృషభాలు గుర్రాలు మేకలు ఒంటెలు కుక్కలు గాడిదలు ఇలానాల్గు కాళ్ళజీవులు
ఎలా కొలువను నిన్నెలా కొలువను
ఎలా కొలువను నిన్నెలా కొలువను ఏడు కొండల వాడ - ఓ వెంకన్న దొర సామి IIఎలాII పల్లె టూరి వాడనయ - పదకవితలు తెలియవయ అన్నమాచార్యలాగ - మిము పొగడగ నాతరమ IIఎలాII
నీడనివ్వని చెడు చీకట్లో
ఆకాశంలో మేఘుముంటే భూమిపై దాని నీడ పడుతుంది మేఘము కదిలితే ఆ నీడ కదులుతుంది కాని అవి రెండు ఎప్పుడూ కలవవు దేని ప్రయాణం దానిదే ఎల్లప్పుడు గాలి వీచి మేఘము కనుమరుగయితే భూమిపై దాని నీడ కనుమరుగవుతుంది
అది ఒక రమణీయం" — కడప ప్రాంత వైభవ గీతం
1. నేపథ్యం — కడప మండల దివ్యక్షేత్రాల హారం:* మీరు అన్నమయ్యను *తాళ్లపాక-తిరుపతి* మధ్యే కాకుండా *కడప జిల్లా మొత్తం* తిప్పుతున్నారు. ఇది *ప్రాంతీయ భక్తి పర్యటన గేయం*. *అ) తాళ్లపాక → చెయ్యేరు → తిరుపతి:* > _తాళ్లపాక అన్నమయ్య తాంబూరను చేతబూని | చెయ్యేరు నదీగడ్డపై నడయాడినాట్యమాడుతూ | తిరుపతి వెంకన్నపైన కీర్తనలు పాడుతువుంటే_
హరి కీర్తనాచార్య! ఓ అన్నమయ్యా !
ఎంత వాడనయ నిను పొగడ హరి కీర్తనాచార్య ! ఓ అన్నమయ్యా "ఎంత " లక్కమాంబ నారాయణ సూరి పుణ్య దంపతుల కడుపు పండగ హరినందకాంశమున జన్మించినావట తాళ్లపాక గ్రామానికి ఘణ కీర్తి తెచ్చావట తిరుపతి కొండజేరి అలిపిరి కొండనెక్కి "అదివో అల్లదివో శ్రీ హరి వాస” మంటు మోకాల్ల పర్వతాన అలసొచ్చి సోలిపొవ
జానపద గేయం : నను ముద్దెట్టు కూన్నాడే మామ
కొండగట్టు చేనుకాడ పంటకాలువ గట్టుమీద పచ్చగడ్డి కోసుకోని గడ్డిమోపు నెత్తెట్టుకోని వడివడిగ నే నడుస్తుంటే పైరుమీద చల్లగాలికి పైటకొంగు జారిపోగ సర్దుకోను కష్టమైంది మామ
ఆంధ్రకాశ్మీరము అరకులోయ (తూర్పు వెళ్లే రైలు)" — విశ్లేషణ
1. ఇతివృత్తం — రైలు ప్రయాణం ద్వారా అరకు దర్శనం:* చిత్రావతి సీరియల్‌లో భాగం కాకపోయినా, మీ శైలిలోనే సాగిన *యాత్రా కావ్యం*. విశాఖ నుండి అరకుకు *రైలు ప్రయాణం* అనే సూత్రంతో *తూర్పుకనుమల ప్రకృతి, జీవవైవిధ్యం, గిరిజన జీవనం* మూడు భాగాల్లో చిత్రించారు.
ఆంధ్ర కాశ్మీరము అరకులోయ
విశాఖస్టేషన్ రైలుపట్టాలపై అరాల్ గుండా తూరుపువెళ్ళేరైలు వేడియావిరి వదలుతూ అప్పటికే వచ్చిఆగింది అరకువెల్లే ప్రకృతిప్రేమికులు బండికదులుతుందని మూటముల్లాచేతబట్టి గబగబా రైలెక్కి సర్దుకొని కూర్చున్నారు
కీడులో మేలు చేకూర్చిన కరోనా
కరోనా ఒక మనిషికాదు అలా అని జంతువుకాదు ఇదొక మహమ్మారి దీనికి కాళ్ళుండవు చేతులుండవు తలవున్నా మెదడుండదు అలా అని ఊరుకుండదు మనిషితో యుద్ధాలు చేస్తుంది అందుకని కరవాలము పట్టదు
ఆవుడూడ పులిచావుకి కారణంబాయె - 17
ఒకనాటి చిత్రావతి నది ఒడ్డు పల్లెల్లో ప్రయాణ సౌకర్యాలు సరిగా లేకుండె ఆడపిల్లల నిచ్చిపుచ్చు కోవడాలు ఏవూరికావూరిలోనే సర్దు బాటుతో జరిగు తుండ ఒకింటి పెద్దకుటుంబీకులు వాళ్ళ ఆడబిడ్డను చదుకున్న యావూరి పోరిగాడి కిచ్చి ఉన్నంతలో ఖర్చు పెట్టి పెళ్ళిచేసిండ్రు ఆడబిడ్డ భరణంగ ఒక దేశపు ఆవును వియ్యపురాలింటికి తోలిచ్చిండ్రు ప్రేమకొద్ది ఆకాలంలో వానలు బాగ పడుతుండే కొండగడ్డి ప్రతియేడు బాగా ఏపుగాపెరుగుతుండె
అడవిపందులవేట ఒక సంప్రదాయపు ఆట-19
చిత్రావతి నదిగట్టు పల్లెల్లో చిట్టడవులతో నిండిన కొండలుండ లుండ పలు పక్షి జంతుజాలములకు నిలయమై కొంతవరకు జీవనాధారమై యుండి ఎండుకట్టె లేరుకతెచ్చి అమ్ముకొని కొందరు అడవిపక్షులను వేటాడుకొచ్చి అమ్ముకొంటూ మరికొందరు జంతువుల వలవేసిపట్టి తెచ్చి అమ్ముకొని మరికొందరు జీవనం సాగించ సామూహికంగ అడవిపందుల వేటాడటం వారికి సాహసముతో కూడిన గొప్ప సరదా
ఆ కుటుంబాలవారి బీదరికము పారదోలి--20
ఆరోజుల్లో నాసొంతూరికి నూరిం డ్లు. బడికెల్లే పిల్లలో వంద పై బడి వుంటే కిటకిటలాడే జనాభా కలదైవుంటుంది కదా ఏటికాలువలో నీరుతోడుకొని మట్టికడవల్లో మోసుకురావడాలు యుక్తవయసు పిల్లలు ఉదయసాయంత్రాల్లో నది ఇసుకమేటలపై ఆడుకోవడాలు చిత్రావతినదిపక్క కెల్లిచూస్తే అర్ధమవుతుంది వూరిజనాభా ఎంతో....
నా ఇతర కవితలు లో "కవియంటే" పె . లక్ష్మణస్వామి, అనంతపురం
'కవి' అంటే రెండక్షరాల పండితుడు అతను రాసేదే మూడక్షరాల 'కవిత్వం' కవిత్వానికి చదువుతో నిమిత్తంలేదు జ్ఞాని, అజ్ఞాని ఎవరైన వారివారి స్థాయిలో కవిత్వాన్ని వర్ణిస్తుంటారు యాదృక్షి కంగా బర్రె లడవికి తోలుకెళ్ళే పశులకాపరి వేమని వంటి వేదాంతులు కవులే
లక్షుంపల్లెలో పెద్దకోట్ల వారి వంశవృక్షం మొలకెత్తి చిగురించుట--08
గొల్ల లక్ష్మన్న, నేసే రామన్నలకు తోడు నాలుగైదు ఇతర కులవృత్తి వారు ఏకమవ్వ చిత్రావతి నది వొడ్డున కొండవాలున నూతన లక్షుంపల్లె గ్రామం నిర్మించ పట్టింది వారికి కొన్నిపదుల ఏండ్లు వారిజీవితంస్వర్గతుల్యంఅవుంతుందని అనుకున్న వారికలల ప్రపంచం అరకొర సౌకర్యాలతో నరకతుల్యమయ్యే కొండలలో విస్తారంగా పెరిగిన బోదగడ్డి పశుసంపడకు ఆకలితీరుతుండె నెమో ఏటినీరు అందరికి డప్పికతీరస్తుండే నేమో గాని,అందరివీ కొత్త సంసారాలాయే
చిత్రావతినదొడ్డు లక్షుంపల్లె పుట్టుక --07A
వసంతాల వెనుక ఈ గ్రామం ఏర్పడినట్లు వంశపారంపర్య తరాలవారు చెప్పుకోగా నాతరంలో నేనూ విన్నాను నది కిరువైపులా సుదీర్ఘ విస్తీర్ణంలో కొండలు వ్యాపించ వివిధ రకాల చిట్టడవి గుబురు చెట్లతోనూ తీగలల్లుకొన్న ముళ్లకంప చట్లతోను బొమ్మజముడు, నాగజముడు, కదర, మంగ, కళీ, జాన,పుల్లరేగు, ఉలిండకాయ చెట్లతోనూ, అక్కడక్కడ చెట్లపోదల్లో పాముల పుట్టలు, తేనె పుట్టలు, డేదారాకు, నల్లతుమ్మ, తెల్లతుమ్మ, శిగర, బొగ్లీ చెట్లు, చేదు కలమంద, మంచి కలమంద, మర్రాకు, బాదామి, నేరేడు, యలమ, ఈత, జివ్వి, మర్రి, రావి, కొండవేప, మంచివేప, నేరేడు,చింత వంటి మరెన్నో పేర్లు
లక్షుంపల్లె - చిత్రావతమ్మ కథలు
మన ఊరి పుట్టుక - 400 ఏళ్ళ క్రితం* గొల్ల లక్ష్మన్న అనే యువకుడు పశువులు మేపుకోడానికి చిత్రావతి ఒడ్డుకు వచ్చేవాడు. రోజూ దూరం వెళ్ళిరావడం కష్టమని, ఇక్కడే ఊరు కట్టుకుందాం అనుకున్నాడు. చేనేత రామన్న-రామక్క, మరికొందరు తోడై కొండ చెట్లు కొట్టి ఇళ్ళు కట్టుకున్నారు. లక్ష్మన్న పేరు మీదుగా మన ఊరికి *'లక్షుంపల్లె'* అని పేరు వచ్చింది. ఆనాడు నీరు, కట్టెలు, గడ్డి కొదవ లేకపోవడంతో అనేక వృత్తులవారు వచ్చి చేరారు.
చిత్రావతినదొడ్డు లక్షుంపల్లె పుట్టుక --07
చిత్రావతి నడిగట్టు వెంబడి వెలసిన ఎన్నోగ్రామాలలో లక్షుంపల్లె ఒకటాయె ఇంచుమించు నాలుగు వందల వసంతాల వెనుక ఈ గ్రామం ఏర్పడినట్లు వంశపారంపర్య తరాలవారు చెప్పుకోవగా నాతరంలో నేనూ విన్నాను నది కిరువైపులా సుదీర్ఘ విస్తీర్ణంలో కొండలు వ్యాపించియుండ వివిధ రకాల చిట్టడవి కొండ చెట్లతోనూ పలు కాయల ,ఫల వృక్షాలతో నిండియుండ ఆయా ప్రాంతాల వారికి జీవనోపాధికి కొడువలేకుండము తో పాటుగా
👉గత కాలం తీపి గురుతులు-(10)👈
రాయలసీమలోని అనంతపురం జిల్లాకు క్షామపీడిత జిల్లాగ పేరు. అందునా ఈజిల్లాలో జీవనదులు లేవు. ఉన్నదల్లా ఒక పెన్నా నదిమాత్రమే. వర్షాలు కురిస్తే ప్రవహించిఎండాకాలంఎండుతుంది. జిల్లాలోదీనికి ఉపనదులు చాలవున్నా ప్రధాన మైనది చిత్రావతినది. ఈరెండు కర్ణాటక నందికొండల శ్రేణుల్లో జన్మించి విడివిడిగాప్రవహించి అనంతపురము కడపజిల్లాల సరిహద్దులోని గండికోటవద్ద ఏకమై ప్రొద్దుటూరు కడప నెల్లూరు మీదుగాప్రవహించి బంగాళాఖతంలో కలుస్తాంది. చిత్రావతిఒడ్డునఎన్నో గ్రామాలు వెలిసియుండ ఒక్కొక్కగ్రామానికి ఒక్కొక్క నాగరికత కలిగియుండ లక్షుంపల్లె గ్రామానికి సంబంధించి ఒకనాటిజీవన శైలిని గూర్చి నా అనుభూతిని పంచుకున్న రీతిని గూర్చి వరుసకవితలు రాయడం జరిగింది. వాటిని ఒక్కొక్కటిగా చదువరుల సౌకర్యార్థం కలిగించ మీకు ఇచ్చట ఉంచడం జరుగుచున్నది.
గత కాలం తీపి గురుతులు -06 (చి. సీ. క )
మాపల్లెటూరుపక్కన చిట్టడవి కప్పిన కొండలు అందు పొదలమాటున పక్షిగూళ్లు గూళ్ళ లో కముజు పిట్టల జంటలు ఆ పిట్టలజంటలు పెందలాడె నిదురలేచి బయటికొచ్చి రెక్కలుచాచి ఒళ్ళువిరిచి ప్రకృతిని చూచి రెక్కలాడించి రివ్వున ఆకాశాని కెగసెళ్ళిపోతూ దారిలో చిత్రావతినది ఏటికాల్వలో నీరుతాగి సుదూరంగ తూర్పుకు పయనించి కోతకుగురైన పంటచేన్లోవాలి కనికరాళ్ళ సందుల్లలో రాలిన కంది, పెసర,ఉలవగింజలు
పకృతి సౌందర్యం మచ్చుకైనా కానరాక-05
ఏటిసోలుపు నిరుపేదగ్రామప్రజకి, అలనాటి రోజుల్లో చిత్రావతినదీమాత జీవనాధారమై ఒప్పారి యుండ నదిఅంచు మడుగుల్లో బటార్లువేసి ఈడ్చడువలతో చేపలుపట్టి, ఒడ్డుకి విసరివేయ పిల్లలు గంతులేస్తూ ఏరి బుట్టల్లో కూరేరు ఏటిజాలల్లో శింగితంవలతో పగల్లు పెట్రోమాక్స్వెలైట్ల వెలుతురులో రాత్రిల్లు చేపలవేటకు సంబరపడి వెల్లి రాత్రంతా వేటాడి తెల్లవారి యిల్లుజేరి చేపలుపంచుకొని తోమిశుభ్రముజేసి చింతపులుసేసి వండుకొని పరుండేరు
🌱నా చిన్న నాటిరోజుల్లో తల్లి చిత్రావతి -04🌱
ఒక వర్షా కాలం రాత్రి పైన కురిసిన వర్షాలకు తెల్లవారంగ ఊరి ముంగిట 'గట్లుతన్నుకొని చిత్రావతి నది. తెల్లని నురుగులతో ఎర్రనివరదనీరు పారె గ్రీష్మమురాకతో వరద తగ్గుముఖంపట్టే చిన్న నీటి పాయలై నదిపారుచుండె ఉదయాన్నే నిదురలేచి బయటికొచ్చి "వాకిటిముంగిట్లో అరుగుమెట్లపై నిల్చొని తూర్పుకు చూడ సూర్యోదయ కాంతి కిరణాలు నీటిజాలలపైపడి సర్ణధారలై తలతలమెరిసి ప్రజ్వరిల్లుచుండె
బామ్మచెప్పిన చందమామకథలు -03 (చి.సీ.క)
చిత్రావతి నదొడ్డుపల్లెలో రైతాంగకుటుంబాలకుతోడు చేతి వృత్తి కుటుంబాలుండంగ సూర్యోదయంతో నిద్దుర లేచి ప్రాతఃకాలవిధులుముగించుకొని చిత్రావతిఏటికొస్తే సందడేసందడి ఆడపడచులు వాకిలిముంగిట్లో పాచికసువులుతోసి ప్యాన్నీళ్ళేసి అలికి రంగవల్లుల ముగ్గులేసి శింగారించి పెరటి వరండాలో అద్దంముందునిల్చొని చెంపెంట్రుకలు దువ్వుకొని తిలకంబొట్టెట్టుకొని రాత్రితీసిదాచిన మల్లెపూదండ
నాటిచిత్రావతి నదిగట్టు పల్లెజీవనం-02 (చి. సీ. క )
రాయలసీమలోని అనంతపురం జిల్లాకు క్షామపీడిత జిల్లాగ పేరు. అందునా ఈజిల్లాలో జీవనదులు లేవు. ఉన్నదల్లా ఒక పెన్నా నదిమాత్రమే. వర్షాలు కురిస్తే ప్రవహించిఎండాకాలంఎండుతుంది. జిల్లాలోదీనికి ఉపనదులు చాలవున్నా ప్రధాన మైనది చిత్రావతినది. ఈరెండు కర్ణాటక నందికొండల శ్రేణుల్లో జన్మించి విడివిడిగా ప్రవహించి అనంపురము కడపజిల్లాల సరిహద్దులోని గండికోటవద్ద ఏకమై ప్రొద్దుటూరు కడప నెల్లూరు మీదుగాప్రవహించి బంగాళాఖతంలో కలుస్తాయి. చిత్రావతిఒడ్డునఎన్నో గ్రామాలువేలిసియుండ ఒక్కొక్కగ్రామానికి ఒక్కొక్క నాగరికత కలిగియుండ లకుంపల్లె గ్రామానికి సంబంధించి ఒకనాటి జీవన శైలిని గూర్చి నా అనుభూతిని పంచుకున్న రీతిని గూర్చి వరుసకవితలు రాయడం జరిగింది.వాటిని ఒక్కొక్కటిగా చదువరుల సౌకర్యార్థం కలిగించ మీకు పంపడం జరుగుచున్నది.
చిత్రావతమ్మను నేనెట్ల మరతు-01. (చి. సీ. క ) పె. లక్ష్మణస్వామి, అనంతపురం
ఇంటిముంగిట చిత్రావతినది ఆ నదితో నాకు ఎంతో అనుబంధం పున్న మిరాత్రుల ఇసుక మేటలపై ఆడుకోవ నన్నానందిందింప జేసిందాతల్లి